AP HighCourt : రోడ్ కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపుపై ఆదేశాలు ఉల్లంఘన.. హైకోర్టు ఎదుట హాజరైన రావత్ !
కోర్టు ఆదేశించినా కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో ఏపీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ హైకోర్టు ఎదుట హాజరవ్వాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు కోర్టుల చుట్టూ తిరగక తప్పడం లేదు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు. రోడ్డు వేసిన ఓ కాంట్రాక్టర్‌కు చాలా కాలంగా బిల్లు చెల్లించలేదు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు రావత్ ధర్మాసనం ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలిచ్చినా బిల్ ఎందుకు చెల్లించడం లేదని న్యాయమూర్తి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ను ప్రశ్నించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు తాము గత వారం చెల్లించామని ఆయన వివరించారు.
ఆదాయం పెరుగుతోంది కానీ అప్పుల భారం అనూహ్యం.. ఏపీ తొమ్మిది నెలల రిపోర్ట్‌లో కాగ్ వెల్లడి !
ఓ రోడ్ కాంట్రాక్టర్ తాను పని పూర్తి చేసినా రూ.62.94లక్షల బిల్లు చెల్లింపులో చాలా కాలం పాటు పెండింగ్‌లో పెట్టారని.. తన బిల్లులు చెల్లించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన హైకోర్టు ఆ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో ఆ వ్యక్తి మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశించినా బిల్లులు చెల్లించలేదు. దీంతో కోర్టు ధిక్కారంగా తీసుకున్న ధర్మాసనం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ను తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
ఇండస్ట్రీ ఒకే మాట మీద ఉండాలి.. టిక్కెట్ రేట్ల వివాదంపై మంచు విష్ణు స్పందన !
హైకోర్టు ఆదేశాల మేరకు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ సోమవారం ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. వారం రోజుల కిందటే బిల్లులు చెల్లించామని తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఏళ్ల తరబడి బిల్లులు ఎందుకు పెండింగ్ పెడుతున్నారని రావత్‌ను ప్రశ్నించింది. రిటైర్డ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, కాంట్రాక్టర్లకు బిల్లుల పెండింగ్‍పై అభ్యంతరం వ్యక్తం చేసింది. బిల్లులు చెల్లించక పోవడం వల్లే వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలివ్వాల్సి వస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఏపీలోని తమిళుల సమస్యలు పరిష్కరించండి, సీఎం స్టాలిన్ ను కలిసిన ఎమ్మెల్యే రోజా
పోలీసులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివిధ కేసుల్లో పదుల సార్లు హైకోర్టు ముందు హాజరు కావాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశించినా పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఆదేశాలను ధర్మాసనం ఇచ్చింది. ముఖ్యంగా ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు విషయంలో ఎక్కువ సార్లు హాజరయ్యారు. అలాగే పోలీసులు అదుపులోకి తీసుకుని కూడా అరె్స్ట్ చూపించని కేసుల్లోనూ పలుమార్లు హైకోర్టు ఉన్నతాధికారుల్ని హైకోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ కేసులు మాత్రం తప్పడం లేదు.