AP IAS Transfers: సీఆర్డీఏ కమిషనర్ మార్పు - ఏపీలో 25 మంది సీనియర్ ఐఏఎస్‌ల బదిలీ !
Andhra Pradesh: ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ను బదిలీ చేశారు. మొత్తంగా పాతిక మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

AP CRDA Commissioner Katmaneni Bhaskar has been transferred : ఆంధ్రప్రదేశ్ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఇరవై ఐదు మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేశారు. ఇందులో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి పనుల్ని పర్యవేక్షిస్తున్న సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ను కూడా బదిలీ చేశారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ కన్నబాబును నియమించారు. మంత్రి నారాయణ వేగాన్ని కాటమనేని భాస్కర్ అందుకోలేకపోతున్నారని.. ఆయనపై మంత్రి అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. దానికి తగ్గట్లుగానే ఆయనను మార్చి కన్నబాబును నియమించారు.
ఇక చీఫ్ సెక్రటరీ రేసులో ప్రముఖంగా వినిపించిన పేరు సాయి ప్రసాద్. ఆయనను ఎక్స్ ఆఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్టు చేసేలా బదిలీ చేశారు. మరో సీనియర్ ఐఏఎస్ అజయ్ జైన్ ను టూరిజం, కల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ కు ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగిస్తూ అగ్రికల్చర్, సెరీకల్చర్ బాధ్యలు అప్పగించారు. పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ డిపార్టుమెంట్ కు కె సునీతను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు.
ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ కమిషనర్‌గా జీ వాణి మోహన్, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా పీయూష్ కుమార్ ను నియమించారు. అత్యంత కీలకమైన జీఏడీ పొలిటికల్ బాధ్యతలను ముఖేష్ కుమార్ మీనాకు అప్పగించారు. సురేష్ కుమార్‌కు..సీఆర్డీఏ కమిషనర్ గా నియమితులైన కన్నబాబు నిర్వహించిన బాధ్యతలన్నీ అప్పగించారు. సెలవులో ఉండి తాజాగా రిపోర్టు చేసిన సౌరభ్ గౌర్ ను సివిల్ సప్లయిస్ శాఖ కమిషనర్ గా నియమించారు. కోన శసిధర్ ను హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ సెక్రటరీగా నియమించారు.
సీఆర్డీఏ కమిషనర్ గా బదిలీ చేసిన కాటమనేని భాస్కర్ కు ఐటీసీ అండ్ ఈ సెక్రటరీగా, ఆర్టీజీఎస్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బాధ్యతలను కూడా ఇచ్చారు. వాకాటి కరుణను సెర్ప్ సీఈవోగా,ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరీగా యువరాజ్, ముడావత్ ఎం నాయక్ కు సోషల్ వేల్పేర్ డిపార్టుమెంట్ సెక్రటరీగా నియమించారు. పవన్ కుమార్ కు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. శేషరిగిబాబు కార్మిక శాఖ కమిషనర్ గా, వాడ్రేవు వినయ్ చంద్ ఎండోమెంట్ రెవిన్యూ సెక్రటరీగా పోస్టింగు పొందారు. వీరపాండియన్ ఫ్యామిలీ అండ్ హెల్త్ కమిషనర్ , హరి నారాయణ స్టాంప్స్ డిపార్టుమెంట్ ఐజీగా, గీరిశను ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ గా , పాతంశెట్టి రవి సుభాష్ ను ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోగా నియమించారు.
Also Read: ఏపీ పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన - 27 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు - ఎవరెరవంటే ?




















