అన్వేషించండి

CM Jagan : గురువారం ఢిల్లీకి సీఎం జగన్ - అధికారిక షెడ్యూల్ ఇదే!

ఏపీ సీఎం జగన్ గురువారం ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని, హోంమంత్రులతో సమావేశంపై స్పష్టత రావాల్సి ఉంది.


 
CM Jagan To Delhi :   ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురు, శుక్రవారాల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఐదో తేదీన ఉదయం  10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. అక్కడ 1 జన్‌పథ్‌ నివాసంలో రాత్రికి బస చేస్తారు. మరి ఐదో తేదీ అంతా ఎవర్ని కలుస్తారు అన్నది స్పష్టత లేదు. ఆరో దేతీదన  ఉదయం 9.45 గంటలకు 1 జన్‌పథ్‌ నివాసం నుంచి విజ్ఞాన్‌ భవన్‌కు చేరుకుని వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రులతో లేదా ప్రధానమంత్రితో సమవేశాల గురించి అధికారికంగా స్పష్టత లేదు. ప్రధాని, హోంమంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తునారు. వారి అపాయింట్మెంట్ల కోసం ఏపీ భవన్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వవర్గాలు చెబుతున్నాయి.   ఇటీవల విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సీఎం  జగన్ ఢిల్లీ  వెళ్లాలనుకున్నారు. కానీ అప్పట్ల అపాయింట్‌మెంట్లు ఖరారు కాకపోవడంతో వెళ్లలేదు.ఇప్పుడు హోంశాఖ సమీక్ష ఉండటంతో ఢిల్లీకి వెళ్తున్నారు.  ఏపీలో ముందస్తు ఎన్నికలపై కొంత కాలంగా చర్చజరుగుతోంది.   ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సైతం.. అక్టోబర్ నెలలోనే వస్తుండటం.. అది కూడా ఆరు నుంచి ఏనిమిదో తేదీ మధ్యన రిలీజ్ కావొచ్చనే సమాచారం వస్తున్న క్రమంలోనే.. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఖరారు కావడంతో మరోసారి చర్చ ప్రారంభమయింది. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే ముందు అసెంబ్లీని రద్దు చేయాలి. నోటిఫై చేయాలి. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈసీ స్వయంగా పర్యటించి సంతృప్తి చెందాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇవాళ అసెంబ్లీ రద్దు చేసి.. రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం అనేది సాధ్యం కాదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.                  

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికల 2024 ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఏడు నెలల ముందు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షాలతో భేటీ అవుతుండటంతో.. ఎన్నికలతోపాటు చంద్రబాబు అరెస్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన పరిణామాలు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి ప్రధాని మోదీకి సీఎం జగన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.                                 

మరో వైపు  ఏపీ ప్రభుత్వం తీవ్రమైన  నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అప్పులకోసం ప్రతీ వారం ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తున్నా.. నిధుల కొరత వెంటాడుతోంది. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాల్సి ఉంది. వచ్చే జనవరిలోపు రూ. పదిహేను వేల  కోట్లు బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ నిధుల సమీకరణ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పెట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ. పది వేల కోట్ల వరకూ ఇస్తారని భావిస్తున్నారు. మరికొన్ని అంశాల్లోనూ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తులు చేసే అవకాశం ఉంది.        

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget