అన్వేషించండి

కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి- కేంద్రంతో చర్చించే అంశాలు ఇవేనా!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు వెళ్లనున్నారు. సీఎం జగన్ మూడు రోజులు పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు వెళ్లనున్నారు. సీఎం జగన్ మూడు రోజులు పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రులతో జగన్ సమావేశం కానున్నారు. రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేయనున్నారు. 6న ఉదయం 9.45 గంటలకు 1 జన్‌పథ్‌ నివాసం నుంచి విజ్ఞాన్‌ భవన్‌కు చేరుకుని వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.

ఏపీలో ముందస్తు ఎన్నికలపై కొంత కాలంగా చర్చజరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలలోనే రానుండటంతో జగన్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తిరేపుతోంది.  ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే ముందు అసెంబ్లీని రద్దు చేయాలి. నోటిఫై చేయాలి. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈసీ స్వయంగా పర్యటించి సంతృప్తి చెందాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పటికిపుడు అసెంబ్లీ రద్దు చేస్తే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం అనేది సాధ్యం కాదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికల 2024 ఏప్రిల్ నెలలో జరగనున్నాయి.                 

 టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. టీడీపీకి ప్రజల్లో సానుభూతికి పెరుగుతోంది. 25 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైలులోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీకి వెళ్లి మోడీ, అమిత్ షాలతో భేటీ అవుతుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.  చంద్రబాబు అరెస్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన పరిణామాలు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి ప్రధాని మోడీకి సీఎం జగన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఏపీ ప్రభుత్వాన్ని నిధుల కొరత వేధిస్తోంది. అప్పుల కోసం ప్రతీ వారం ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తోంది. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాల్సి ఉంది. వచ్చే జనవరిలోపు రూ. పదిహేను వేల  కోట్లు బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉందని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్ర విభజన హామీలపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నారు జగన్. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: వైసీపీ 880 కి.మీ రోడ్లు.. రెండేళ్లలో కూటమి 6,500 కి.మీ- పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
వైసీపీ 880 కి.మీ రోడ్లు.. రెండేళ్లలో కూటమి 6,500 కి.మీ- పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ దగ్గరకు రానీయడం లేదు: ఏపీ మంత్రి సంచలనం
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ దగ్గరకు రానీయడం లేదు: ఏపీ మంత్రి సంచలనం
CM Chandrababu: చాయ్ విక్రేత నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ: కెపాసిటీ బిల్డింగ్‌కు నిదర్శనమన్న సీఎం చంద్రబాబు
చాయ్ విక్రేత నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ: కెపాసిటీ బిల్డింగ్‌కు నిదర్శనమన్న సీఎం చంద్రబాబు

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Embed widget