By: ABP Desam | Updated at : 10 Mar 2023 06:35 PM (IST)
తెలంగాణ నేతలకు తోడు ఏపీ బీజేపీ కూడా - ఢిల్లీ లిక్కర్ స్కాంపై బీఆర్ఎస్‌ను కార్నర్ చేసే ప్రయత్నం !
APBJP On Delhi Liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ , బీఆర్ఎస్ పార్టీ నేతలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే ఎక్కువగా ఢిల్లీ, తెలంగాణ బీజేపీ నేతలే స్పందిస్తున్నారు. దీనికి కారణం ఆ రెండు పార్టీలు ఆయా రాష్ట్రాల్లో కీలకం కావడమే కాదు.. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా ఆ రాష్ట్రాలకు చెందినవారే. అయితే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మారినట్లుగా ప్రకటించుకుంది. దీంతో ఏపీ బీజేపీ నేతలు కూడా ఈ అంశంపై బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ లో ఈడి అంటే కామెడీ అనుకుంటున్నారు!
స్కామ్ కేసులో నిందితుడు పిళ్ళై వాగ్మూలాన్ని గతంలో #MLC కవిత గారి పేరు చెప్పి నేడు వెనక్కి తీసుకుంటాడట?
తాను కవిత బినామీ అని ఈడీకి పొరపాటున చెప్పాడంట?
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ కామెడీ చేయడానికి వాల్లు #BRS కార్యకర్తలు కాదు ! — Vishnu Vardhan Reddy (@SVishnuReddy) March 10, 2023
జాతీయ స్థాయిలో ఏపీ బీజేపీ అభిప్రాయాలు తెలుసుకోవాలంటే జాతీయ మీడియా ప్రధానంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని సంప్రదిస్తూంటుంది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కూడా మంచి పట్టు ఉన్న ఆయన ఆయా మీడియాలకు బీజేపీ స్పందన తెలియచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తరచూ బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని రామచంద్ర పిళ్లై రౌస్ అవెన్యూ కోర్టులో వేసిన పిటిషన్ అంశంపై విష్ణురవ్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఈడీ అంటే కామెడీ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో సింపతీ కోసం డిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రయత్నిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హర్షిత అనే యువతి.. నైట్ సమయంలో ప్రయాణానికి సికింద్రాబాద్ వద్ద సెక్యూర్ ట్రాన్స్ పోర్టు లేదని ట్వీట్ చేశారు. కేటీఆర్, కవితకు ట్యాగ్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందించి డీజీపీకి సిఫారసు చేశారు. హర్షితకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఇది చీప్ పీఆర్ ట్రిక్ అని.. విష్ణువర్దన్ రెడ్డి సటైర్ వేశారు. ఢిల్లీలో కవిత చేస్తున్న ధర్నాకు అటెన్షన్ కోసమే ఇలా చేశారని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు.
Shri @KTRBRS & his sister are neither HM nor Transport Minister yet this account with only 1 tweet tagged them and got an instant reply.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) March 10, 2023
This cheap PR trick by the TRS is to help @RaoKavitha in her political drama happening in Delhi.#DelhiLiquorScam #PRJeeviTRS @blsanthosh pic.twitter.com/yMgohvSojl
ఓ వైపు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజగా ఉంటూ మరో వైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ నుంచి బీఆర్ఎస్ ను టార్గెట్ చేసే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. జాతీయ మీడియాకు బీజేపీ తరపున అభిప్రాయాలు చెబుతూ.. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు
AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!
ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు
Pawan Kalyan Comments: అసెంబ్లీలో గోరంట్లపై వైసీపీ నేతల దాడి, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపు
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్