అన్వేషించండి

CM Jagan : కట్టని, కట్టలేని గ్రాఫిక్స్ రాజధాని కోసం వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమం - సీఎం జగన్

CM Jagan : కట్టని, కట్టలేని గ్రాఫిక్స్ రాజధాని కోసం అమరావతిలో వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమం జరుగుతోందని సీఎం జగన్ ఆరోపించారు.

CM Jagan : ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. వికేంద్రీకరణపై స్వల్ప చర్చ జరుగుతోంది. ఈ చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి 1000 రోజులుగా ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్‌ గురించి కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ సొంత అభివృద్ధి కోసమే అమరావతి ఉద్యమం అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ కన్నా కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పదన్నారు.  దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. రాజధానిలో తన అనుచరులతో చంద్రబాబు భూములు కొనుగోలు చేశారని సీఎం జగన్ ఆరోపించారు. 

రూ.లక్షా 65 వేల కోట్లు ఖర్చు చేశాం- సీఎం జగన్ 

 ప్రజా సంక్షేమానికి రూ.లక్షా 65 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ అసెంబ్లీలో తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు  హయాంలో సంక్షేమ పథకాలు, పేదలకు పక్కా ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దోచుకో, దాచుకో, పంచుకో ఇదే టీడీపీ సిద్ధాంతమని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి రూ.4-5 లక్షల కోట్లు అవుతాయని చంద్రబాబు అన్నారని, ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున రూ.లక్షా 10 వేల కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబే చెప్పారన్నారు. ప్రతిపక్షంలోనూ తన మనుషులే ఉండాలని చంద్రబాబు కోరుకుంటారని సీఎం జగన్‌ విమర్శించారు. 

అమరావతిపై నాకు కోపం లేదు

"ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం ఒక్క రోజు కూడా ఉద్యమం చేయని చంద్రబాబు, ఇతర పెత్తందారులు ఇప్పుడు కట్టని రాజధాని కోసం వెయ్యి రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రాజధాని కోసం ఇతర ప్రాంతాల వారిని రెచ్చగొడుతూ ఒక ఉద్యమం నడుపుతున్నారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమా? ఈ ఉద్యమం. పెత్తందారులు సొంత అభివృద్ధి కోసం అమరావతి ఉద్యమం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ప్రభుత్వం అనుకుంటే కోర్టుల్లో కేసులు వేయిస్తారు. ఎందుకంటే కేవలం చంద్రబాబుకు చెందిన పెత్తందారుల ప్రైవేట్ స్కూళ్లల్లోనే ఇంగ్లీష్ మీడియం ఉండాలని కోర్టులకెక్కారు. అమరావతి ప్రాంతంపై నాకు ఎందుకు కోపం? ప్రతి ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశమే ఉంటుంది. కానీ ఒక ప్రాంతంపై ఎక్కువ ప్రేమ ఉండదు. అమరావతి ప్రాంతం ఇటు విజయవాడ అటు గుంటూరుకు దూరంగా ఉంటుంది. ఇటువంటి ప్రాంతంలో కేవలం కనీసం రోడ్లు, కరెంట్, నీరు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వమే రూ. 1.10 లక్షల కోట్లు అవుతుందని చెప్పారు. కేవలం మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు అవుతుంది. బిల్డింగులు లేకుండానే ఇంత ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు అవుతుందని చెప్పిన చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో కేవలం రూ.5674 కోట్లు మాత్రమే రాజధానికి కేటాయించారు. ఇందులో రూ.2297 కోట్లు కట్టకుండా బకాయిలుగా పెట్టారు. తన బినామీల కోసం ఇక్కడ రాజధాని పెట్టారు." - సీఎం జగన్ 

ఉత్తరాంధ్ర ప్రజలకు భావోద్వేగాలు ఉండవా? 
 
"చంద్రబాబు హయాంలో, ఇప్పుడు ఒకే బడ్జెట్‌ ఉంది. టీడీపీ హయాంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకివ్వలేదు. అప్పుడు దోచుకో పంచుకో తినుకో అనే విధంగా పాలన సాగించారు. బినామీ భూములు ప్రాంతమే రాజధానిగా ఉండాలని అమరావతిలో రాజధాని పెట్టారు.   రాష్ట్ర రాజధానిపై రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. తాత్కాలిక రాజధానిలో చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కొందరు పెత్తందారుల కోసమే అమరావతి ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమాల పేరుతో పెట్రోల్, డీజిల్ పోసి ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు భావోద్వేగాలు ఉండవా?. ఉత్తరాంధ్రప్రజలు మాత్రం కామ్ గా ఉండాలంట. దుష్టచతుష్టీయం రాష్ట్రాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు. "- సీఎం జగన్ 

Also Read : TDP MLAs Suspension: అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ - ఎప్పటివరకంటే ?

టాప్ హెడ్ లైన్స్

YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget