Breaking News: ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వద్దకు వైఎస్ విజయమ్మ.. బాధితులను ఓదార్చుతూ కంటతడి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
వైఎస్ విజయమ్మ పరామర్శ
సైదాబాద్‌లో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని వైఎస్ విజయమ్మ పరామర్శించారు. బుధవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన విజయమ్మ వారిని ఓదార్చారు. అఘాయిత్యంపై చలించిన విజయమ్మ వారి ఎదుటే భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆ వీధి చివరే వైఎస్ షర్మిల దీక్ష చేస్తుండగా.. అక్కడికి వెళ్లి ఆమెతో పాటు దీక్షలో కూర్చున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా 76 కోట్ల వ్యాక్సిన్ డోసులు
భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం 76 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేడు ఒక్కరోజే 57 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా వెల్లడించింది.
India administered more than 57 lakh vaccine doses till 7pm today. With this, the total number of vaccinations has crossed the 76 crore mark: Government of India pic.twitter.com/UyYXIG6oyR
— ANI (@ANI) September 15, 2021





















