అన్వేషించండి

Eco Sensitive Zone in Kolleru: ఎకో సెన్సిటివ్ జోన్ గా కొల్లేరు - పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వంపై ప్రత్యేక దృష్టి

Andhrapradesh News: కొల్లేరు ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ గా మార్చి, అభయారణ్యంతో పాటు పరివాహక ప్రాంతాల రక్షణకై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రజల అభిప్రాయాన్ని సేకరించనుంది.

Kolleru Eco Sensitive Zone: కొల్లేరు.. ఈ పేరు వినగానే ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు నిలయమైన స్వచ్ఛమైన సహజ సిద్ధ మంచినీటి సరస్సు మనకు గుర్తొస్తుంది. 901 చదరపు కి.మీ మేర విస్తరించి దేశంలోనే అత్యంత పెద్ద మంచి నీటి సరస్సుగా, జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఉన్న ఈ ప్రాంతం పర్యాటకంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో కొల్లేరు ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొల్లేరు అభయారణ్యంతో పాటు పరీవాహక ప్రాంతాల పరిరక్షణకై ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొల్లేరు ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు కానుంది.

ఎకో సెన్సిటివ్ జోన్ ఏంటంటే?

కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ కొన్ని కార్యకలాపాలను నియంత్రించడమే ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దుల ప్రాథమిక లక్ష్యం. దీని ద్వారా కొల్లేరు ప్రాంతంలో పర్యావరణానికి హాని కలిగించే చర్యలను నియంత్రించనున్నారు. ఈ క్రమంలో వన్యప్రాణుల అభయారణ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షించనుంది. కొల్లేరు ప్లస్ కాంటూర్ కి పైన 10 కి.మీ పరిధి వరకు ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దులు నిర్దారణ చేయనున్నారు.

కలెక్టర్ ఆదేశాలు

కొల్లేరు ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దుల నిర్ధారణ ప్రతిపాదనలకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని తాజాగా నిర్వహించారు. సరిహద్దుల నిర్ధారణ కోసం సమగ్రమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. ఎకో సెన్సిటివ్ జోన్ ప్రాంతాన్ని, నిర్థారణ పనులను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా, అటవీ, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, ట్రాన్స్ కో, రెవెన్యూ, పంచాయతీ, మత్స్య శాఖ, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, భూగర్భ జలాలు, మున్సిపల్, పర్యావరణ, పరిశ్రమలు, సర్వే, స్వచ్చంద సంస్థలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దులు నిర్దారణ క్రమంలో ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అలాగే కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో గ్రామసభల నిర్వహణకు సంబంధించి పూర్తి షెడ్యూల్ తయారు చేసి, సంబంధిత గ్రామాల ప్రజలకు దాని వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలియజేస్తారు.

ప్రభుత్వానికి నివేదిక

గ్రామ సభల్లో వచ్చే సూచనలు, అభ్యంతరాలను నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక అందిస్తుంది. అలాగే కొల్లేరు కాలుష్యానికి ముఖ్య కారణమైన విజయవాడ నుంచి వచ్చే బుడమేరు వ్యర్ధాలు కొల్లేరులో కలవకుండా, తగిన చర్యలు చేపట్టేందుకు అధికారులు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.

వలస పక్షులకు పుట్టిల్లు

ఏటా సైబీరియా, ఆస్ట్రేలియా, నైజీరియా వంటి దేశాల నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వలస పక్షులు ఇక్కడకు వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. గతంలో స్థానిక పక్షులు కలిపి 189 రకాలు కొల్లేరుపై ఆధారపడి జీవించేవని, ఇప్పుడు సుమారు 73 రకాల పక్షులున్నట్లు అధికారిక సమాచారం. కొల్లేరులో దాదాపు 140 రాకల చేప జాతులున్నట్లు అంచనా. అరుదైన నల్ల జాతి చేపలు ఇక్కడే పురుడు పోసుకున్నట్లు పేర్కొంటున్నారు. మార్పు, కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ, ఇసుక దొందులు వంటి ప్రత్యేక చేపలు ఇక్కడ పుట్టినవేనని చెబుతారు. కొల్లేటి ప్రాంతాన్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Also Read: Telangana Elections 2023 : ఎన్నికల యుద్ధంలో ముందే ఓడిపోయిన చిన్న పార్టీలు - త్యాగం చేశాయా ? రాజకీయమా ?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget