అన్వేషించండి

Corruption: అమ్మో.. రెవెన్యూ అధికారులా.. ఆ జిల్లాలో పెరిగిపోతున్న ‘అనంత’ అవినీతి..!

కొందరు రెవెన్యూ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నప్పటికీ.. మనం దొరకం కదా,  ఏమీ కాదులే అన్న ధీమాలో ఉన్నారు. సమస్య వచ్చినపుడు కలెక్టరేట్ కు అటాచ్ చేయడం, లేదా సస్పెన్షన్‌తో సరిపుచ్చడం జరుగుతోంది.

కొందరు రెవెన్యూ అధికారుల అక్రమాలకు అంతులేకుండా పోతోంది. తక్కువ సమయంలో కోట్లకు పడగలెత్తాలన్న ఆలోచనతో కొందరు సిబ్బంది పనిచేస్తున్నారు. కొందరు రెవెన్యూ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నప్పటికీ.. మనం దొరకం కదా,  ఏమీ కాదులే అన్న ధీమాలో ఉన్నారు కొందరు సిబ్బంది, అధికారులు. సమస్య వచ్చినపుడు కలెక్టరేట్ కు అటాచ్ చేయడం, లేదా సస్పెన్షన్‌తో సరిపుచ్చడం జరుగుతోంది. తరువాత రెండు నెలలకు మళ్లీ ఎక్కడో మారుమూల ప్రదేశానికి పోస్టింగ్ ఇప్పించుకోవడం.. అక్కడి నుంచి మెయిన్ స్ట్రీమ్ కు రావడంతో కొందరు అవినీతి అధికారుల్లో భయం లేకుండా పోయింది.  
జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసిన భూముల ధరలు కోట్లకు చేరడంతో రెవెన్యూ అధికారుల ధనదాహానికి అంతులేకుండా పోతుంది. ఎక్కడ చూడు ఏదో ఒక వివాదం... దాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది చెలరేగిపోతున్నారు. ఇటీవల కదిరి తహశీల్దార్ డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ వార్త రాగానే కలెక్టర్ సంబందిత తహశీల్దార్ ను కలెక్టరేట్ కు అటాచ్ చేసి విచారణ కు ఆదేశించారు. ఏకంగా సంబంధిత తహశీల్దార్ వాటాలో జాయింట్ కలెక్టర్, కలెక్టర్ కు ఇవ్వాల్సి వుంది అంటూ ఆడియోలో మాట్లాడారంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. కదిరిలో తహశీల్దార్ పై ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా అలాగే కొనసాగిస్తున్నారు. ఇక ఆడియో బయటకు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి తప్పించారు. 
ఆత్మకూరు తహశీల్దార్, ఆర్ఐపై ఏకంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు చోట్ల భాదితులు రెవెన్యూ అధికారులపై ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. బత్తలపల్లిలో ఇటీవల రెవెన్యూ అదికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏకంగా మృతదేహాన్ని తీసుకువచ్చి తహశీల్దార్ టేబుల్ మీద ఉంచి ఆందోళన చేశారంటే వారు ఎంత వేదనకు గురయ్యారో చెప్పేందుకు ఇది నిదర్శనంగా మారింది. ఇలా చెప్పుకొంటూ పోతే జిల్లా వ్యాప్తంగా అనేక సంఘటలు వెల్లువెత్తుతున్నాయి. 
Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?

హిందూపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో తహశీల్దార్ పోస్టుకు ఎంత డబ్బు అయిన ఇచ్చి వెళ్లాలి అని అనుకుంటారని స్థానికులు చెబుతున్నారు. జిల్లాలో ఏ రెవిన్యూ డివిజన్లో అయినా సరే భూములు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటికి సంబంధించి భూ వివాదాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. ఇప్పటికే రెవెన్యూ అధికారులపై పలుమార్లు పిర్యాదులు వస్తున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు వీటిపై అంతగా దృష్టి పెట్టలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి పాల్పడుతున్న సిబ్బంది, కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరిగిపోయింది. లేకపతే ఇప్పటికే గాడి తప్పిన రెవెన్యూ వ్యవస్థ మరింతగా అవినీతి జరిగే అవకాశాలు వున్నాయి. కలెక్టర్ ఇప్పటికే ఇద్దరు రెవిన్యూ అధికారులను కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరికొందరిని సెలవులపై పంపుతున్నారు. కానీ అవినీతి సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోకుండా తాత్కాలిక చర్యలు తీసుకున్నందునే లంచాలు ఇవ్వకపోతే పని జరగదనే పరిస్థితులు కనిపిస్తున్నాయని సమాచారం.

Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget