Guntur NTR Statue: పట్టపగలే సుత్తితో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. టీడీపీ ఆందోళనలు, నిందితుడు అరెస్టు

ఆదివారం రాత్రి దుర్గి మండల కేంద్రంలోని బస్టాండ్‌ కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని వైఎస్ఆర్ సీపీ నాయకుడి కుమారుడు సుత్తితో కొడుతూ ధ్వంసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

FOLLOW US: 

గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా దుర్గిలో 144 సెక్షన్‌ విధించారు. ఆదివారం రాత్రి దుర్గి మండల కేంద్రంలోని బస్టాండ్‌ కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని వైఎస్ఆర్ సీపీ నాయకుడి కుమారుడు సుత్తితో కొడుతూ ధ్వంసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. 

టీడీపీ నిరసనల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో పలువురు టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఈ చర్యను నిరసిస్తూ గుంటూరులోని చంద్రమౌళినగర్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. పల్నాడు ప్రాంతంలో ఆందోళన నిర్వహించిన టీడీపీ నేత చిరుమామిళ్ల మధుబాబు, ఒప్పిచర్ల వద్ద జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద బాబును హౌస్ అరెస్టు చేశారు. 

Also Read: సూర్యాపేట కాలేజీలో ర్యాగింగ్, యువకుడ్ని రూంకి పిలిచి బట్టలిప్పించి.. బలవంతంగా ట్రిమ్మర్‌తో...!

నందమూరి రామకృష్ణ ఆగ్రహం
ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసంపై ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య తెలుగుజాతిని అవమానించినట్లేనని అన్నారు. ఇలాంటివి చేస్తే తెలుగు జాతి ఊరుకోదని, దుండగులను వెంటనే అరెస్టు చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మరోవైపు, చిలకలూరి పేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. వైఎస్ఆర్ సీపీ స్కీములన్నీ స్కాములేనని.. రాష్ట్రంలో ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.

నిందితుడి అరెస్టు
దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి కోటేశ్వరావును ఆదివారమే పోలీసులు అరెస్టు చేశారు. దుర్గి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోగా.. నేడు రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు సదరు ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read: Sharmila: ఏపీలో పార్టీ పెట్టొచ్చు.. పెట్టకూడదన్న రూలేమన్నా ఉందా ? : షర్మిల

Also Read: అతడిది "ఆవిడా మా ఆవిడే " స్టోరీనే కానీ తెలియకుండా మేనేజ్ చేసేశాడు.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు ..! ఎందుకంటే ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Jan 2022 01:47 PM (IST) Tags: guntur tdp protests NTR Statue Guntur NTR statue Durgi incident Macharla NTR statue

సంబంధిత కథనాలు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Mla Balakrishna : ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ తిప్పలు, వైసీపీ గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తుంది - ఎమ్మెల్యే బాలకృష్ణ

Mla Balakrishna :  ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ తిప్పలు, వైసీపీ గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తుంది - ఎమ్మెల్యే బాలకృష్ణ

Telugu Desam Party : సై అంటున్న సైకిల్ పార్టీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచన

Telugu Desam Party : సై అంటున్న సైకిల్ పార్టీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచన

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు,  నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

Balakrishna About NTR: ఎన్టీఆర్‌కు నటుడు బాలక్రిష్ణ ఘన నివాళి - తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య కీలక నిర్ణయం

Balakrishna About NTR: ఎన్టీఆర్‌కు నటుడు బాలక్రిష్ణ ఘన నివాళి - తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య కీలక నిర్ణయం

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!

Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !