News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

పది గంటలకుపైగా చంద్రబాబును విచారించిన సిట్‌ - ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు

శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి సిట్ కార్యాలయంలో కూర్చోబెట్టి చంద్రబాబును ప్రశ్నించారు అధికారులు.

FOLLOW US: 
Share:

శుక్రవారం అర్ధరాత్రి మొదలైన హడావుడి ఇంకా కొనసాగుతూనే ఉంది. నంద్యాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని అక్కడే బస చేసిన చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి 3 గంటలకు మొదలైన హైడ్రామాకు ఇంకా తెరపడలేదు. వేకువజాము 3 గంటల తర్వాత ఆయన్ని సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. 

శనివారం ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు వెంటనే అక్కడి నుంచి విజయవాడ తరలించారు రోడ్డు మార్గంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి సిట్ కార్యాలయంలో కూర్చోబెట్టి చంద్రబాబును ప్రశ్నించారు అధికారులు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఇప్పటి వరకు సేకరించిన మెటీరియల్‌తో చంద్రబాబును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రాత్రి ఏదో టైంలో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు పూర్తి చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తారని అంతా భావించారు. కానీ రాత్రంతా ఆయన్ని సిట్ కార్యాలయంలోనే ఉంచారు. 

మధ్య మధ్యలో భోజనానికి, ఫ్యామిలీతో మాట్లాడేందుకు ఆయనకు బ్రేక్ ఇచ్చారు. ఈ విచారణ టైంలో కనీసం ఆయన తరఫున లాయర్లతో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. అక్కడకు వెళ్లిన న్యాయవాదులను రోడ్డుపై నుంచే బయటకు పంపేశారు. ఒక్క ఫ్యామిలీ మెంబర్స్‌ను మాత్రమే లోనికి రప్పించారు. వారిని కూడా గంటల తరబడి వెయిట్ చేయించి ఓ పావు గంట పాటు మాట్లాడించారు. 
అర్ధరాత్రి రెండున్నర గంటలకు పోలీస్ బెటాలియన్‌ను రెడీ చేశారు. ఆసుపత్రికి తరలిస్తారనే ప్రచారం మొదలైంది. పోలీసులు ఆయన కాన్వాయ్‌ను సిద్ధం చేశారు.

స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి ఎవర్నీ అనుమతించడం లేదు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సిట్ కార్యాలయం నుంచి చంద్రబాబును విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అక్కడ న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయం బట్టి  అధికారులు చర్యలు తీసుకోనున్నారు. 

లంచ్‌మోషన్ పిటిషన్ తిరస్కరించిన జడ్జి
చంద్రబాబు అరెస్టు అక్రమమని ఆయన తరఫు లాయర్లు లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. అయితే రిమాండ్ రిపోర్టు రానందున పిటిషన్‌పై విచారణ చేపట్టలేమని తేల్చేశారు. టీడీపీ లీగల్ సెల్ వేసిన పిటిషన్ తిరస్కరించారు. 

కుటుంబసభ్యులు చంద్రబాబును పరామర్శించారు. అయితే మీరెవరు ఆందోళన చెందవద్దు అంటూ కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ధర్మం తనవైపే ఉందని, కుట్ర రాజకీయాలను తాను సమర్థవంతంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. చంద్రబాబుతో మాట్లాడాక కుటుంబసభ్యులు సిట్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మొదటగా భువనేశ్వరి, లోకేష్ మరికొందరు కుటుంబసభ్యులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయలుదేరిన బాలక్రిష్ణ, బ్రాహ్మణి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి సిట్ ఆఫీసుకు చేరుకున్న కొంత సమయానికి చంద్రబాబును కుటుంబసభ్యులు కలిసి కేసు విషయంపై చర్చించారు. విచారణ మధ్యలో తన లాయర్ ను చంద్రబాబును కలిసి కేసు విషయం వివరించినట్లు తెలుస్తోంది. 

Published at : 10 Sep 2023 02:59 AM (IST) Tags: AP News AP Politics Skill Development Scam Chandrababu Skill Development #tdp Chandrababu Arrest

ఇవి కూడా చూడండి

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

పవన్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీస్‌- ఆధారాలు సమర్పించాలని ఆదేశం

పవన్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీస్‌- ఆధారాలు సమర్పించాలని ఆదేశం

Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

AP BJP: చంద్రబాబు అరెస్ట్‌, పవన్‌ పొత్తు ప్రకటనపై ఏపీ బీజేపీ స్టాండ్‌ ఏంటి- కోర్‌ కమిటీలో కీలక నిర్ణయం

AP BJP: చంద్రబాబు అరెస్ట్‌, పవన్‌ పొత్తు ప్రకటనపై ఏపీ బీజేపీ స్టాండ్‌ ఏంటి- కోర్‌ కమిటీలో కీలక నిర్ణయం

Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!

Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!

టాప్ స్టోరీస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...