అన్వేషించండి

Sajjala on Chandrababu: బెయిల్ రాగానే నిర్దోషి అయిపోతారా? వ్యవస్థల్ని మేనేజ్ చేసి తెచ్చుకున్నారు - సజ్జల కీలక వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy: వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పి కోర్టులను కూడా మభ్యపెడుతున్నారని సజ్జల ఆరోపించారు.

Sajjala Ramakrishna Reddy Comments on Chandrababu: చంద్రబాబు (Chandrababu Naidu) తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని రిపోర్టులు క్రియేట్ చేసుకొని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ పొందారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (AP Skill Development Case) విషయం పరంగా తమకు ఎలాంటి సంబంధం లేదని వారు నిరూపించుకోవడం లేదని అన్నారు. ఎంత సేపూ వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పి కోర్టులను కూడా మభ్యపెడుతున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు. తాను మాజీ సీఎం అని, వయసు పైబడిందని చెప్పుకుంటూ సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ రెగ్యులర్ బెయిల్ సాయంతో సత్యం గెలిచింది, అసత్యంపై యుద్ధం మొదలు కాబోతుందనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తారని అన్నారు.

టీడీపీ నేతలు స్కిల్ డెవలప్ మెంట్ కేసు గురించి మాట్లాడకుండా, ఆ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకునే ప్రయత్నం లేకుండా మిగతా వాటిపై ఆధారపడుతున్నారని అన్నారు. జైలులో దోమలు ఉన్నాయని, ఆరోగ్యం బాగోలేదని, గుండె సమస్యలు ఉన్నాయని, చర్మ సమస్యలు వచ్చాయని, 70 ఏళ్ల వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారనే ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారని సజ్జల రామక్రిష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబుకు బెయిల్ రాగానే ఆయన నిర్దోషి అని టీడీపీ నేతలు వాదిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు (Chandrababu Naidu) విజయయాత్ర చేస్తామని అంటున్నారని, అనారోగ్యంతో ఉంటే ఎలా చేస్తారని సజ్జల (Sajjala Ramakrishna Reddy) నిలదీశారు.

చంద్రబాబు (Chandrababu Naidu) జైలు లోపల ఉన్నా బయట ఉన్నా ఒకటే అని అన్నారు. చంద్రబాబు (Chandrababu Naidu) బయట ఉంటే 2014 నుండి 2019 వరకు ఏం చేశాడో చెప్పాల్సి వస్తుందని.. ఈ కేసులో చంద్రబాబు (Chandrababu Naidu) శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. ‘‘ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయి.. విచారణ ఎదుర్కోక తప్పదు. హైకోర్టు కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చింది. అరెస్ట్ అయినప్పటి నుంచి కేసు గురించి చంద్రబాబు (Chandrababu Naidu) అస్సలు మాట్లాడడం లేదు. ఇదొక్కటే కాదు ఇంకా చాలా కేసులు కూడా ఉన్నాయి. ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం కేసులు కూడా ఎదుర్కోవాలి’’ అని సజ్జల రామక్రిష్ణా రెడ్డి తెలిపారు.

షెల్‌ కంపెనీల పేరుతో అవినీతి జరిగిందని. ప్రజల సొమ్మును దోచేశారని సజ్జల ఆరోపించారు. నకిలీ ఫేక్‌ ఇన్వాయిస్‌లతో రూ.241 కోట్లు దోచేశారని ఆరోపించారు. కిలారి రాజేశ్‌, పెండ్యాల శ్రీనివాస్‌లకు నోటీసులు ఇచ్చారని.. ఐటీ శాఖ నోటీసుల్లో అన్ని లింకులు బయటపడ్డాయని చెప్పారు. చంద్రబాబు (Chandrababu Naidu) డైరెక్షన్‌లోనే స్కిల్‌ స్కామ్‌ జరిగిందని, ఆయనే సంతకాలు చేశారని ఆరోపించారు. ఏ రోజు కూడా స్కిల్‌ స్కామ్‌ జరగలేదని చంద్రబాబు (Chandrababu Naidu) లాయర్లు వాదించలేదని గుర్తు చేశారు. గంటా సుబ్బారావును ఐదు పదవుల్లో కూర్చోబెట్టారని.. నిధులు దారిమళ్లాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget