అన్వేషించండి

Peddireddy Accident: మంత్రి పెద్దిరెడ్డి కారు ప్రమాదంలో కుట్ర కోణం, ప్రభుత్వం విచారణ జరిపించాలని వైసీపీ నేతల డిమాండ్

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి కారు ప్రమాదంలో కుట్ర కోణం ఉందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ చేయించాలన్నారు.

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారు ప్రమాదం ఘటనపై వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదంలో కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ చేయించాలని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు డిమాండ్ చేశారు.

కారు ప్రమాదంపై వైసీపీ నేతల కామెంట్స్... 
మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం వైసీపీ శ్రేణులలో కలకలం రేపింది. అయితే ఇరువురు నేతలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవటంతో వైసీపీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల చిత్తూరు కేంద్రంగా టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి మధ్య రాజకీయంగా హాట్ కామెంట్స్, సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఇదే సమయంలో పెద్దిరెడ్డి ఆయన కుమారుడైన ఎంపీ మిథున్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావటంపై కుట్ర కోణం దాగి ఉందని వైసీపీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.

రాష్ట్రంలో నీచ రాజకీయం... కాపు కార్పొరేషన్ ఛైర్మన్ 
సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే చంద్రబాబు కంట కన్నీరు వస్తోందని కాపు కార్పొరేషన్ అడపా శేషు అన్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును చూస్తే నీచంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని, చంద్రబాబు హత్యా రాజకీయాలు చేయడంలో దిట్ట అని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తోన్న సంక్షేమం చూసి చంద్రబాబు ఒర్వలేకపోతున్నారని,పెద్దిరెడ్డి ఎదుర్కొన్న రోడ్డు ప్రమాదాన్ని వేరే రకంగా మేము చూస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదంపై అనుమానాలున్నాయని తెలిపారు.పెద్దిరెడ్డికి జరిగిన రోడ్డు ప్రమాదంతో ఆయన్ను ఏం చేద్దామనుకుంటున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డిపై రోడ్డు ప్రమాదం విషయంలో కుట్రకోణం దాగి ఉందని, సమగ్రంగా ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని  కోరుతున్నామన్నారు. కేవలం పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి  టార్గెట్ గా ప్రమాదం జరిగినట్లు అనుమానం కలుగుతుందన్నారు.

కుట్రలకు ఐకాన్ చంద్రబాబు అని, గతంలో ఆయన పలువురిని అంత మొందించినట్లు ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ప్రమాదాన్ని కుట్రగా అనుమానించి కమిటీ వేసి విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు అడపా శేషు వెల్లడించారు. పెద్దిరెడ్డి పై చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, మీకూ అదే పరిస్థితి వస్తుందని చంద్రబాబును హెచ్చరించారు. చంద్రబాబుకు దమ్ముంటే పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో  పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అతి త్వరలోనే ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెబుతారని, మీ పరిపాలనలో ఒక్క ఇంటి నైనా పేదలకు కట్టించి ఇచ్చారా అని మాజీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.

ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలపై చంద్రబాబుకు నమ్మకం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు జరిగేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కారణమని ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలు  తిరగబడాలని అప్పుడే బుద్ధి వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి రోడ్డు ప్రమాద ఘటన పై విచారణ చేయించాలని కోరతామని, ఈ విషయంలో స్థానిక పోలీసులు సైతం అసలు నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అభిప్రాయపడ్డారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Rapido Data Leak: యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Embed widget