News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IT Notice To Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు- ఓ జాతీయ న్యూస్‌ పోర్టల్ సంచలన కథనం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నట్టు హిందుస్థాన్‌ టైమ్స్‌ స్టోరీ వేసింది.

FOLLOW US: 
Share:

IT Notice To Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసినట్లు ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇన్ఫ్రా  సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా ఆయన వంద కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయని ఆ కథనం సారాంశం. చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగస్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. షోకాజ్‌ నోటీసుల్లో..  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఐటీ శాఖ ప్రశ్నించిందట. 

హిందుస్థాన్ టైమ్స్‌ ప్రచురించిన కథనం ప్రకారం...చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో కాంట్రాక్టు సంస్థలను బెదిరించారని, బోగస్‌ కంపెనీలు సృష్టించి సబ్‌ కాంట్రాక్టుల రూపంలో అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయి. 

ఇంకా కథనంలో ఏమున్నాయంటే....

2019లో ఐటీ శాఖ అధికారులు షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ నివాసంలో 2019 నవంబర్‌లో సోదాలు నిర్వహించారు. అక్కడ లభించిన సమాచారంతో 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ నివాసంలో సోదాలు చేశారు. అక్కడ దొరికిన సమాచారం మొత్తాన్ని క్రోడీకరించి ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ను తయారు చేసింది. లభించిన ఆధారాల ప్రకారం సంబంధిత వ్యక్తులను పిలిపించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఆ వాంగ్మూలాలపై వారు సంతకాలు కూడా పెట్టారు. వాటన్నింటి ఆధారంగా ఐటీ అధికారులు చంద్రబాబుకు ఇప్పుడు నోటీసులు పంపినట్లు సమాచారం.

షాపూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరిల్లో టిడ్కో ఇళ్లు, అమరా­వతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతోపాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌ పనులు చేసింది. ఆయా పనుల్లో చంద్రబాబు కమీషన్లు తీసుకున్నారనే ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీనివాస్‌ అనే వ్యక్తి ద్వారా బోగస్‌ కంపెనీలు ఏర్పాటు చేసి సబ్‌ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వమన్నట్లు ఐటీ గుర్తించిందని ప్రస్తుతం కథనం.  

వీటి పాటు ఆయా కంపెనీల ప్రతినిధుల నుంచి వాంగ్మూలంగా తీసుకుని ఐటీ అప్రైజల్‌ రిపోర్ట్‌ తయారు చేశారు. దాన్ని చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు చూపించారు. అదంతా వాస్తవమేనని శ్రీనివాస్‌ అంగీకరించి సంతకాలు కూడా చేశారు. శ్రీనివాస్‌తోపాటు రఘు, మిగిలిన వారిని కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు. వాళ్లు కూడా అదంతా వాస్తవమేనని అంగీకరించి సంతకాలు కూడా చేశారని ఐటీ అప్రైజల్‌ రిపోర్ట్‌‌లో తేలిందని పేర్కొన్నారు. 

ఈ అక్రమ లావాదేవీలు అన్నీ షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ కోడ్‌ భాషలో తన ఈ–మెయిల్‌ ఐడీకే మెయిల్‌ చేసుకుని భద్ర పరిచినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారట. ఎవరెవరికి ఎంతెంత మొత్తం చెల్లించింది కోడ్‌ భాష ‘టన్నుల’ రూపంలో పేర్కొన్నట్టుగా పూర్తి వివరాలు వెల్లడ­య్యా­యని తెలిపారు. హైదరాబాద్‌కు 3 టన్నులు, ఢిల్లీకి 3 టన్నులు, ముంబాయికి 3.5 టన్నులు.. ఇలా భారీగా నిధులను మళ్లించినట్లు ఐటీ అధికారులు గుర్తించారని అంటున్నారు. 

Published at : 01 Sep 2023 09:34 AM (IST) Tags: IT department Income Tax Department Show Cause Notice Chandrababu Naidu

ఇవి కూడా చూడండి

ప్రజల్లోకి నారా భువనేశ్వరి- త్వరలోనే బస్సు యాత్ర!

ప్రజల్లోకి నారా భువనేశ్వరి- త్వరలోనే బస్సు యాత్ర!

Chandrababu Hunger Strike: నేడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ నిరాహార దీక్ష - భువనేశ్వరి సైతం!

Chandrababu Hunger Strike: నేడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ నిరాహార దీక్ష - భువనేశ్వరి సైతం!

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Chandrababu Arrest: చంద్రబాబు ఓ క్రిమినల్, అందుకే అరెస్ట్ చేశారు - స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

Chandrababu Arrest: చంద్రబాబు ఓ క్రిమినల్, అందుకే అరెస్ట్ చేశారు - స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ

టాప్ స్టోరీస్

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!