అన్వేషించండి

Guntur MLA Winner List 2024: గుంటూరు కారం ఈసారి మరింత ఘాటు- ఇంతకి ఇక్కడ ఛాన్స్ ఎవరికి ఉంది?

Guntur District Assembly Election Results 2024: ఈసారి గుంటూరు జిల్లాపై అందరి ఫోకస్ ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ పడినప్పటి నుంచి అభ్యర్థుల మార్పుతో ఎలాంటి ఫలితాలు వస్తాయో అన్న ఆసక్తి ఏర్పడింది.

Guntur Constituency MLA Winner List 2024: రాజకీయంగా చాలా చైతన్యవంతమైన గుంటూరు జిల్లా ఫలితం ఎప్పుడూ ప్రత్యేకమే. ఈసారి అన్ని పార్టీలు ఊహించని పేర్లను తెరపైకి తీసుకొచ్చాయి. అన్నింటిని తట్టుకొని కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. గుంటూరు మొత్తాన్ని ఊడ్చి పడేసింది.  

 

నియోజకవర్గం

విేజేత

1

తాడికొండ

తెనాలి శ్రవణ్‌ కుమార్‌

2

మంగళగిరి

నారా లోకష్‌ 

3

పొన్నూరు

ధూళిపాళ్ల నరేంద్ర

4

తెనాలి

నాదెండ్ల మనోహర్

5

ప్రత్తిపాడు

వరుపుల సత్యప్రభ

6

గుంటూరు ఈస్ట్

మహ్మద్‌ నజీర్‌

7

గుంటూరు వెస్ట్

పిడుగురాళ్ల మాధవి

 

తెలుగుదేశం పార్టీకి పూర్తి పట్టున్న గుంటూరు(Guntur) జిల్లాలో  వైఎస్‌ఆర్ ప్రభావం చూపారు. పాదయాత్రతో జిల్లా ఓటర్లను ఆకర్షించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress)కు విజయం సాధించిపెట్టిన వైఎస్‌ఆర్‌....2009లోనూ హవా కొనసాగించారు. ఒక్క పొన్నూరు మినహా మిగిలిన సీట్లన్నీ కాంగ్రెస్ వశమయ్యాయి.

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పూర్తిగా చచ్చిపోయింది. జనసేన, బీజేపీతో కలిసి బరిలో దిగిన తెలుగుదేశం(Telugudesam)..విజయఢంకా మోగించింది. ఐదు సీట్లలో విజయం సాధించింది. కొత్తగా బరిలో దిగిన వైసీపీ(YCP) రెండుచోట్ల గెలిచి ఉనికి చాటుకుంది. అమరావతి(Amaravathi) మహానగరాన్ని సృష్టించి వేలకోట్లు పెట్టుబడితో కొత్తరాజధాని నగరం నిర్మాణం ప్రారంభించడమేగాక...జిల్లాలో ఒక్కసారిగా రియల్‌ భూం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చావుదెబ్బతగిలింది. రాజధాని ప్రజలు ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు.

ఏకంగా చంద్రబాబు తనయుడు మంత్రి లోకేశ్‌(Lokesh) సైతం మంగళగిరి(Mangalagiri)లో ఓడిపోయారు. రాజధాని నియోజకవర్గం తాడికొండలోనూ  తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవలేకపోయారు. ఒక్క గుంటూరు వెస్ట్‌ మినహా మిగిలిన సీట్లన్నీ వైసీపీ వశమయయ్యాయి. ఓటమి ఎరుగుని ధూళిపాళ్ల నరేంద్ర సైతం ఈఎన్నికల్లో ఓటమి రుచిచూశారు. గుంటూరు ప్రజల నాడి ఎవరికి అందదని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత గెలిచిన ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే సైతం అధికారపార్టీ పంచన చేరడంతో జిల్లాలో తెలుగుదేశానికి ప్రాతనిధ్యమే లేకుండా పోయింది. అయితే అనూహ్యంగా ఎంపీసీటు మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం విశేషం. గత ఎన్నికల కన్నా ఈసారి జిల్లాలో ఓటింగ్ శాతం తగ్గిపోయింది. క్రితం సారి 79.39శాతం ఓట్లు పోలవ్వగా...ఈసారి 78.81శాతమే ఓటింగ్ జరిగింది.

                                        గుంటూరు జిల్లా

 

2009

2014

2019

తాడికొండ

కాంగ్రెస్

టీడీపీ

వైసీపీ

మంగళగిరి

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

పొన్నూరు

టీడీపీ

టీడీపీ

వైసీపీ

తెనాలి

కాంగ్రెస్

టీడీపీ

వైసీపీ

ప్రత్తిపాడు

కాంగ్రెస్

టీడీపీ

వైసీపీ

గుంటూరు ఈస్ట్

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

గుంటూరు వెస్ట్

కాంగ్రెస్

టీడీపీ

టీడీపీ

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget