By: ABP Desam | Updated at : 08 Apr 2022 11:31 AM (IST)
కేబినెట్‌లో ట్విస్ట్
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ జిల్లా నుంచి ఎవరి ఛాన్స్ దొరుకుతుందా అనే చర్చ తీవ్రంగా నడుస్తోంది. కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను చూసుకొని తన టీంను జగన్ రెడీ చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబున్నాయి.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా నిన్న సమావేశమైన కేబినెట్ సభ్యులంతా రాజీనామా చేశారు. అంతా తమ రాజీనామా లేఖలను జగన్‌కు ఇచ్చేశారు. మాజీల అనుభవాన్ని పార్టీకి వాడుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
మంత్రులు రాజీనామా చేసిన 24 గంటలకు గడవక ముందే పరిణామాలు మారిపోయాయి. పాతవారిలో ఎక్కువ మందికి ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు నుంచి సమాచారం అందుతోంది. పాత వారిలో నాలుగురైదుగుర్నే తీసుకుంటారని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు కానీ ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని ఇప్పుడు లేటెస్ట్ సమాచారం.
వచ్చే రెండేళ్లు ప్రభుత్వానికి లిట్మస్ టెస్టులాంటిది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దీనికి పార్టీ నేతలతోపాటు మంత్రులు కూడా కీలక పాత్ర పోషిస్తారు. అందుకే ఇలాంటి టైంలో రిస్క్ తీసుకోకూడదని జగన్ భావించినట్టు తెలుస్తోంది. సేఫ్ సైడ్ పాత మంత్రుల్లో పది మందినికి మళ్లీ ఛాన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. పని తీరు, సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని పాత మంత్రుల్లో పది మందిని కొనసాగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మళ్లీ మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేసే వారిలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, సీదిరి అప్పల రాజు, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, అంజాద్ బాషా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. వీరిలో సీదిరి అప్పల రాజు, చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణకు మంత్రి పదవి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. అందుకే వీళ్లని మళ్లీ కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది.
నిన్న మంత్రి వర్గం సమావేశం పూర్తైన తర్వాత బయటకు వచ్చిన మంత్రులు చాలా మంది కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడున్న వారిలో నలుగురైదుగుర్ని కంటిన్యూ చేస్తారని వెల్లడించారు. పరిస్థితితుల దృష్ట్యా మరికొందర్ని కొనసాగించవచ్చని తెలుస్తోంది.
ఎవర్ని కొనసాగిస్తారు.. ఎంత మందిని కొత్తవారిని తీసుకుంటారనే విషయంపై పార్టీలో ఇంత వరకు ఎవరికీ సమాచారం లేదని నేతలు చెబుతున్నారు. 11వ తేదీన ప్రమాణస్వీకారానికి మాత్రం పాత మంత్రులందర్నీ రమ్మన్నట్టు తెలిపారు. కొత్త మంత్రి వర్గం 11 వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రామామ స్వీకారం చేయనుంది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయానికి సమాచారం పంపించారు సీఎం జగన్.
Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
Sajjala on Chandrababu: టీడీపీ నేతలకు పైత్యం బాగా పెరిగింది, అన్ని తప్పుడు వార్తలే - చంద్రబాబు
Polytechnic Branches: పాలిటెక్నిక్ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్
SI Recruitment: ఎస్ఐ పోస్టుల భర్తీలో కీలక పరిణామం - కోర్టులోనే 'ఎత్తు' కొలవండి, హైకోర్టు ఆదేశం
AP ICET: ఏపీ ఐసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల, కళాశాలలవారీగా సీట్ల వివరాలు ఇలా
Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
KCR Election Campaign: హైదరాబాద్ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం- నేడు గజ్వేల్‌లో ఫైనల్ మీటింగ్
Kriti Sanon : బన్నీతో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా: కృతిసనన్
Kangana Ranaut: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?
/body>