అన్వేషించండి

AP News: కౌలు రైతులకు రుణాలిస్తాం, బ్యాంకులు మాకు సహకరించాలి - బ్యాంకర్ల మీటింగ్‌లో బుగ్గన

Bankers Committee Meeting: ఏపీ సచివాలయంలో ఆయన అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది.

AP State Level Bankers Committee Meeting: రాష్ట్రంలో 2023-24 ఆర్ధిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివిధ బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా గత సమావేశ యాక్షన్ టేకెన్ రిపోర్ట్, డిసెంబరు 2023 బ్యాంకింగ్ కు ఇండికేటర్స్, 2023-24 వార్షిక రుణ ప్రణాళిక సాధించిన ప్రగతి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, డిజిటల్ జిల్లాలు, కేంద్ర ప్రభుత్వ, ఆర్బీఐ ఆన్ గోయింగ్ ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ కౌలు రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి ఆదుకోవాలనేది ఈప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. కౌలు రైతులకు రుణాలందించడంలో వివిధ బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ణప్తి చేశారు.

అదే విధంగా పాడిపరిశ్రమాభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని.. ఈరంగంలో కూడా తగిన రుణాలు అందించాలని విజ్ణప్తి చేశారు. ముఖ్యంగా మూడు నాలుగు జిల్లాల్లో డైరీ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయని కావున ఆయా జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టి డైరీ రంగం అభివృద్ధికి హితోదిక సాయం చేయాలని ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బ్యాంకర్లకు సూచించారు. రాష్ట్రంలో కోళ్ళ పెంపకం, మత్స్య పరిశ్రమ రంగాలు అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కావున ఈ రెండు రంగాల్లోని రైతులకు అన్ని విధాలా తగిన రుణ సహాయం అందించి ప్రోత్సహించేందుకు బ్యాంకులు తమ వంతు కృషి చేయాలని మంత్రి రాజేంద్రనాధ్ విజ్ణప్తి చేశారు. 

ఏపీ టిడ్కో కింది జగనన్న నగరాలు నిర్మాణంలో లబ్దిదారులకు మరింత చేయూతనిచ్చి వేగవంతంగా ఇళ్ళు నిర్మించుకునేందుకు తగిన సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో వివిధ ప్రైవేటు బ్యాంకులు కూడా తమ వంతు తోడ్పాటును అందించాలని మంత్రి రాజేంద్రనాధ్ విజ్ణప్తి చేశారు. 

ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ.. ఏపీలో మెరుగైన ఈ క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. అదే విధంగా గుడ్ గవర్నెన్స్ లో ఏపీ ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందని అన్నారు. వార్షిక రుణ ప్రణాళిక అమలులో వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతికి వివిధ బ్యాంకరులను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం.రవీంద్ర బాబు రాష్ట్రంలో 2023-24 వార్షిక ఋణ ప్రణాళిక అమలుకు సంబంధించి డిశంబరు నెలాఖరు వరకు వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళిక అమలులో డిశంబరు చివరి నాటికే మంచి ప్రగతి సాధించారని బ్యాంకరులందరినీ అభినందించారు. ఏపీలో వివిధ రంగాల అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని కావున బ్యాంకులు ఆయా రంగాల్లో మరింత తోడ్పాటును అందించేందుకు కృషి చేయాలని కోరారు. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాలు అందించటలో మంచి ప్రగతి సాధించారన్నారు. ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్ కు నాబార్డు పూర్తి సహకారాన్నిఅందింస్తోందని తెలిపారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ మాట్లాడుతూ పంట రుణాలు అందించటలో మంచి ప్రగతి సాధించారని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget