అన్వేషించండి

Minister Narayana: మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తాం: మంత్రి నారాయణ

Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేసి తీరుతామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం కక్షగట్టి నిర్మాణాలను ఆపేసిందని ఫైర్​ అయ్యారు.

Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేసి తీరుతామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైందన్నారు. గత ప్రభుత్వం కక్షగట్టి నిర్మాణాలను ఆపేసిందని ఫైర్​ అయ్యారు. అవరోధాలను అధిగమించి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. టెండర్ల ప్రక్రియను ఈ జనవరి నెలాఖరులోపు పూర్తిచేసి ఫిబ్రవరి రెండోవారంలో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు. 

వైసీపీ అరాచక పాలన
శుక్రవారం రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అరాచక పాలన చేపట్టి ప్రజలను భయభ్రాంతులను గురి చేసిందన్నారు.

Also Read: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం - కొత్త టెర్మినల్ పనుల్లో హఠాత్తుగా పడిపోయిన నిర్మాణం

రాష్ట్రస్థాయి అధికారులందూ ఒకేచోట ఉండేలా..
మంత్రి మాట్లాడుతూ.. తమపై కక్షతో గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలను ఆపివేసిందని ఆరోపించారు. అమరావతిని విధ్వంసం చేసేందుకు మూడు రాజధానుల అంశాలను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు.‘అమరావతి రాజధాని కోసం రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. రాజధానిని ప్రపంచంలో టాప్‌-5లో ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ఐకానిక్‌ భవనాల డిజైన్లను నార్మన్‌ ఫాస్టర్‌ చేత చేయించాం. రాష్ట్రస్థాయి అధికారులందూ ఒకేచోట ఉండేలా ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశాం. అధికారులు, ఉద్యోగులు, జడ్జిల కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్‌మెంట్ల పనులు ప్రారంభించాం. మాపై కక్షతో గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలను ఆపివేసింది. కోటి 3 వేల చదరపు అడుగుల తో భవనాలు డిజైన్ చేసి పనులు ప్రారంభించాం. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి.. మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్‌గా మార్చాలని డిజైన్లు రూపొందించాం. విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, తాగు నీటి పైపులు అండర్ గ్రౌండ్‌లో ఉండేలా డిజైన్ రూపొందించాం’ అని నారాయణ తెలిపారు.

నిర్మాణాలు మొత్తం నీళ్లలో పెట్టేసింది
‘2015 జనవరి ఒకటో తేదీన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం ఈ నిర్మాణాలు మొత్తం నీళ్లలో పెట్టేసింది. నీళ్లలో ఉండటంతో నాణ్యత కోసం ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేశాం. విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, తాగు నీటి పైపులు అన్నీ అండర్ గ్రౌండ్‌లో ఉండేలా డిజైన్ చేశాం. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మొత్తం అడవిగా మార్చేసింది. ఇలా చేసినందుకే ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. వై నాట్ 175 అంటే 11 సీట్లే వచ్చాయి. జనవరి నెలాఖరు లోగా అన్నీ పూర్తి చేసి ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభిస్తాం. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం’అని మంత్రి నారాయణ వెల్లడించారు.

Also Read: బడ్జెట్‌ హల్వా - ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని స్పెషాలిటీ ఏంటి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Exclusive: సినీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 2 రోజుల్లో కార్మికులకు న్యాయం !
సినీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 2 రోజుల్లో కార్మికులకు న్యాయం !
AP DSC 2025 Merit List: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ మెరిట్ లిస్ట్ ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ మెరిట్ లిస్ట్ ఎప్పుడు?
Nidhi Agarwal car controversy: వీరమల్లు హీరోయిన్‌కు ప్రభుత్వ కారిచ్చారా ? -  తేలిపోయిన రాజకీయ వివాదం -ఇదిగో క్లారిటీ
వీరమల్లు హీరోయిన్‌కు ప్రభుత్వ కారిచ్చారా ? - తేలిపోయిన రాజకీయ వివాదం -ఇదిగో క్లారిటీ
Tollywood: పెద్ద, చిన్న నిర్మాతల్లో విబేధాలు... రెండు వర్గాలుగా చీలిన టాలీవుడ్... సమ్మెలో కొత్త మలుపు
పెద్ద, చిన్న నిర్మాతల్లో విబేధాలు... రెండు వర్గాలుగా చీలిన టాలీవుడ్... సమ్మెలో కొత్త మలుపు
Advertisement

వీడియోలు

Tollywood Producers meet Minister Kandula Durgesh | సినీ నిర్మాతలతో మంత్రి దుర్గేష్ భేటీ | ABP Desam
ASI Aparna Lava Kumar Viral Video | Ambulance ముందు పరుగులు పెట్టిన ఏఎస్ఐ | ABP Desam
Jr NTR Apologize to CM Revanth Reddy
Jawahar Lift Irrigation Project | జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
BCCI on Virat Kohli and Rohit ODI Retirement | విరాట్, రోహిత్ రిటైర్మెంట్ పై BCCI కీలక వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Desam Exclusive: సినీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 2 రోజుల్లో కార్మికులకు న్యాయం !
సినీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 2 రోజుల్లో కార్మికులకు న్యాయం !
AP DSC 2025 Merit List: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ మెరిట్ లిస్ట్ ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ మెరిట్ లిస్ట్ ఎప్పుడు?
Nidhi Agarwal car controversy: వీరమల్లు హీరోయిన్‌కు ప్రభుత్వ కారిచ్చారా ? -  తేలిపోయిన రాజకీయ వివాదం -ఇదిగో క్లారిటీ
వీరమల్లు హీరోయిన్‌కు ప్రభుత్వ కారిచ్చారా ? - తేలిపోయిన రాజకీయ వివాదం -ఇదిగో క్లారిటీ
Tollywood: పెద్ద, చిన్న నిర్మాతల్లో విబేధాలు... రెండు వర్గాలుగా చీలిన టాలీవుడ్... సమ్మెలో కొత్త మలుపు
పెద్ద, చిన్న నిర్మాతల్లో విబేధాలు... రెండు వర్గాలుగా చీలిన టాలీవుడ్... సమ్మెలో కొత్త మలుపు
AP DSC Results 2025: ఏపీ డీఎస్సీ 2025 ఫలితాల్లో టెట్ మార్కులు సరిచేసుకోండి! స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్, నార్మలైజేషన్ వివరాలు!
ఏపీ డీఎస్సీ 2025 ఫలితాల్లో టెట్ మార్కులు సరిచేసుకోండి! స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్, నార్మలైజేషన్ వివరాలు!
AP Free Bus Guidelines: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మార్గదర్శకాలు విడుదల
ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మార్గదర్శకాలు విడుదల
PM Modi: ఢిల్లీలో ఎంపీల కోసం 184 ఫ్లాట్లు ప్రారంభించిన ప్రధాని మోదీ, బిహార్ ఎన్నికలు గుర్తొస్తాయని సెటైర్లు
ఢిల్లీలో ఎంపీల కోసం 184 ఫ్లాట్లు ప్రారంభించిన మోదీ, బిహార్ ఎన్నికలు గుర్తొస్తాయని సెటైర్లు
Son murdered Mother: అలాంటివాడ్ని కనడమే ఆమెకు శాపం - నరికి చంపేసిన కన్నకొడుకు- ఏలూరులో ఘోరం !
అలాంటివాడ్ని కనడమే ఆమెకు శాపం - నరికి చంపేసిన కన్నకొడుకు- ఏలూరులో ఘోరం !
Embed widget