Budget 2024: రూ.1,29,972.97 కోట్ల ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం.. దేనికి ఎంత కేటాయించారంటే.?
Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ అయింది. సుమారు రూ1.30 లక్షల కోట్లతో బడ్జెట్ విడుదల చేయనున్నారు.
AP Government Ordinance To Vote On Account Budget : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1,29,972.97 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకువస్తోంది. ఎన్నికల కారణంగా ఏప్రిల్ నుంచి జూలై మధ్య మొదటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ విడుదల చేసేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు. ఈ మేరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం జూలై నెలలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని అంతా భావించారు. అయితే, మరికొన్ని నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.
గత వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మంగళవారం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ కు ఆన్లైన్ ద్వారానే మంత్రివర్గం నుంచి ఆమోదం తీసుకుంది. తదుపరి ప్రక్రియలో భాగంగా గవర్నర్ ఆమోదం కోసం అకౌంట్ ఆర్డినెన్సు పంపించారు. తాజాగా ఈ ఆర్డినెన్స్ ఎక్కువగా ఉన్నారు ఆమోదం తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకురావడం ఇదే తొలిసారి. సుమారు రూ.1.30 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు.
2024 సెప్టెంబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 40 విభాగాలకు చెందిన డిమాండ్ గ్రాంట్లు ఉన్నట్లు చెబుతున్నారు. రోడ్ల మరమ్మతులు, అన్న క్యాంటీన్ల నిర్మాణాలకి బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నట్లు తెలిసింది. కొన్ని కేంద్ర పథకాలకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్లకు నిధులు కేటాయించినట్లు సమాచారం. ఆగస్టు 15 నుంచి 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వీటిని నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తి స్పష్టత వచ్చాక పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోటను ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: రాష్ట్రానికి రూ. 3 వేల కోట్ల రుణం, కొత్తగా అప్పు చేసిన ఏపీ సర్కార్!
విభాగాల వారీగా కేటాయింపులు ఇవే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబోయే నాలుగు నెలల కాలానికి ప్రతిపాదించిన ఈ బడ్జెట్లో జలవనరుల శాఖకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. భారీ, మధ్య తరహా, చిన్న నీటిపారుదలకు రూ.13,308.50 కోట్లు పెట్టుబడి వ్యయంగా కేటాయించింది. గత ఐదేళ్లలో నిరసించిన పలు ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించేందుకు నీటిపారుదలకు భారీగా నిధులను కేటాయించింది. వివిధ సంక్షేమ శాఖలకు కలిపి రూ.15,140 కోట్లు కేటాయించింది. రహదారులు భవనాల శాఖకు రూ.2,017, పాఠశాల విద్యకు రూ.1,458 కోట్లు, ఉన్నత విద్యకు రూ.141.02 కోట్లు, నైపుణ్య శిక్షణకు రూ.81.83, వైద్యం, ఆరోగ్యానికి రూ.1,198 కోట్లు, పట్టణ అభివృద్ధికి రూ.4,424 కోట్లు, సాంఘిక సంక్షేమానికి రూ.61.73, గిరిజన సంక్షేమానికి రూ.30.27, బీసీ సంక్షేమానికి రూ.27.03, మైనారిటీ సంక్షేమానికి రూ.7.66, మహిళా సంక్షేమానికి రూ.106.49 కోట్లు, వ్యవసాయానికి రూ.35.50 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.1549.27 కోట్లు, భారీ మద్య, నీటిపారుదాల, భారీ మద్య నీటిపారుదలకు రూ.12,658.18 కోట్లు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.650.32 కోట్లు చొప్పున కేటాయింపులను చేసింది. మొత్తంగా 40 ప్రభుత్వ శాఖలకు రాబోయే నాలుగు నెలల ఖర్చులకు ఆర్డినెన్స్ రూపంలో అనుమతిని ప్రభుత్వం పొందింది.
జల వనరుల శాఖలో కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. బిల్లులు ఆగిపోవడంతో రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి. తాజా కేటాయింపుల్లో పోలవరం నిధులు కలిపి ఉంటాయి. ఆయా బిల్లులను ఈ బడ్జెట్లోకి బదిలీ చేసి వాటికి బడ్జెట్ విడుదల చేస్తే నిధులు లభ్యతను బట్టి ఆ మొత్తాలను విడుదల చేసేందుకు, కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు వీలు కలుగుతందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్య ప్రకారం అడుగులు వేస్తోంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఎత్తిపోతల నీటిని మళ్లించేందుకు, ఆ కాలువ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఇందుకోసం రూ.1000 కోట్లకు పైగా అవసరం అవుతుందని భావిస్తోంది. ప్రభుత్వం ఇతర ప్రాజెక్టులు పూర్తికి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. డెల్టా వ్యవస్థలో అవసరమైన పనులు చేపట్టడం, కాలువలు పూడుకు తీత పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది.
Also Read: తీవ్ర అసహనంలో టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అంచనాల్ని అందుకోలేకపోతున్నారా ?