అన్వేషించండి

Andhra Pradesh Latest News: మెడికల్ కాలేజీ అప్పగింతకు మరోసారి టెండర్లు! పీపీపీ విధానంపై ముందుకేనంటున్న ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Latest News: పీపీపీ విధానంలో వైద్యకాలేజీలు అభివృద్ధి చేసేందుకు మరోసారి టెండర్లు పిలవడానికి సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులకు సూచించింది.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సామాన్యులకు, పేదల ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్యం అందించేందుకు పీపీపీ విధానం ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహణ బాధ్యతను అప్పగించేందుకు యత్నించింది ప్రభుత్వం. కానీ ఒక్క ఆదోని కాలేజీ కోసమే బిడ్‌ దాఖలు అయింది. మిగతా కాలేజీలకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో రాజీ లేదని పేదలకు మెరుగైన వైద్యం కోసం ముందడుగు వేయాలని సూచించారు. 

రాష్ట్రంలోని వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన తాజా సమీక్షా సమావేశం రాష్ట్ర ఆరోగ్య ముఖ చిత్రాన్ని మార్చే దిశగా సాగింది. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారిన ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం విధానంపై ప్రభుత్వం తన దృఢ నిశ్చయాన్ని ప్రకటించింది. 

పీపీపీ విధానంపై అపోహలు వద్దు

వైద్య రంగంలో పీపీపీ విధానం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని వస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ విధానం వెనుక ఉన్న శాస్త్రీయతను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ పద్ధతిని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విధానం ద్వారా ఒక మెడికల్ కాలేజీ లేదా ఆసుపత్రి నిర్మాణ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 3 శాతం ఆర్థిక మద్దతు అందిస్తాయని చెప్పారు. మిగిలిన పెట్టుబడిని ప్రైవేటు సంస్థలు భరిస్తాయని వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వం ఖజానాపై భారం తగ్గడమే కాకుండా, ప్రజలకు కార్పొరేట్ స్థాయి వసతులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోందని, పీపీపీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు. 

మెడికల్ కాలేజీల టెండర్లు- ఆదోనిలో ముందడుగు 

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియలో పీపీపీ విధానం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే తాజా టెండర్ల ప్రక్రియ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ప్రభుత్వం మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించింది. బుధవారం సాయంత్రంతో ముగిసిన గడువులోకా కేవలం కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి బిడ్ దాఖలైంది. ప్రముఖ వైద్య సంస్థ కిమ్స్‌ ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ టెండర్ వేసింది. 

మిగిలిన మూడు ప్రాంతాలైన మార్కాపురం, మదనపల్లె, పులివెందులలో టెండర్లు వేయడానికి ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. అందుకే ప్రభుత్వం స్పందించి పీపీపీ విధానం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలులో ఉందని గుర్తు చేస్తోంది. వెనక్కి తగ్గడం లేదని చెబుతోంది. బిడ్లు దాఖలు కాని కాలేజీల కోసం మరోసారి టెండర్లు ప్రక్రియను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకు వచ్చిన సంస్థతో త్వరలోనే ఒప్పందం చేసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ప్రభుత్వం కేవలం భవనాల నిర్మాణంతో సరిపెట్టకుండా ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాలు, మందుల లభ్యత, వైద్యుల నియామంపై కూడా దృష్టి సారించిందని చెప్పారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగుతుందని పేర్కొన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget