YS Jagan: వైసీపీ ఎమ్మెల్యేలపై సీఎ జగన్ ప్రైవేట్ గా సర్వే, ఆ 25 మంది ఎవరని పార్టీలో చర్చ!
YS Jagan survey Over YSRCP MLAS: పార్టీకి అనుబంధంగా ఉన్న ఐ ప్యాక్ టీం సర్వే కాకుండా, అధినేత జగన్ మరో ప్రైవేట్ టీంతో కొందరు శాసన సభ్యుల పై సర్వే చేయిస్తున్నారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతుంది.
YS Jagan survey Over YSRCP MLAS: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ప్రైవేట్ సర్వే అంశం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీకి అనుబంధంగా ఉన్న ఐ ప్యాక్ టీం సర్వే కాకుండా, అధినేత జగన్ మరో ప్రైవేట్ టీంతో కొందరు శాసన సభ్యుల పై సర్వే చేయిస్తున్నారనే అంశంపై అధికార పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రైవేట్ సర్వే..
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో ఇప్పుడు ప్రైవేట్ సర్వేకు చెందిన అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సెలెక్టెడ్ గా ఎంపిక చేసిన శాసనసభ్యుల లిస్ట్ ను స్వయంగా పార్టి అధినేత వైఎస్ జగన్ రెడీ చేసి ఓ ప్రైవేట్ సంస్దతో సర్వే చేయిస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహరం పైనే ఇప్పుడు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఎంపిక శాసన సభ్యుల జాబితాలో ఎవరెరవరు ఉన్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అంతే కాదు స్వయంగా జగనే రంగంలోకి దిగి, పార్టీకి చెందిన సీనియర్ నేతతో మధ్యవర్తిత్వం నడిపిస్తూ పాతిక మంది శాసన సభ్యులపై ప్రైవేట్ సర్వే చేసి, రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్రపై జగన్ ఫోకస్ పెట్టి, ఆ ప్రాంతానికి చెందిన 25మంది శాసన సభ్యులపై నివేదిక కావాలని సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకరిద్దరు మాజీ మంత్రులు ఉన్నారని అంటున్నారు..
పార్టీ లెక్కలు ఆధారంగా...
శాసన సభ్యులపై సర్వే అభిప్రాయాలను సేకరించటంలో వైసీపీ మెదటి నుండి ప్రత్యేక స్దానం ఉంది. పాలిటిక్స్ లో సలహాదారులుగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలను తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలకు పరిచయం చేసింది జగనే.. అంతే కాదు ఎమ్మెల్యేల రిపోర్ట్ కార్డ్ కోసం ప్రైవేట్ సంస్దల నుండి నివేదికలను తీసుకునే సంస్కృతి సైతం వైస్ఆర్ కాంగ్రెస్ పార్టినే ప్రవేశపెట్టింది. సర్వేల ఆధారంగానే అభ్యర్దులను ఎంపిక చేసుకోవటం వారికి టిక్కెట్లను కేటాయించటంలో జగన్ అంతే కీలకంగా నిర్ణయాలు తీసుకుంటారనే విషయంలో సందేహం లేదు. అయితే గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తయింది. వచ్చే ఏడాది మరోసారి ఎన్నికలను ఫేస్ చేయనున్నారు. ఇప్పుడు లెక్కలు వేరే విధంగా ఉంటాయన్నది జగన్ అభిప్రాయంగా చెబుతున్నారు. అందులో భాగంగానే 25మంది శాసన సభ్యుల నియోజకవరాల్లోని గత పరిస్దితులు, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు, రేపు రాబోయే పరిస్దితులను అంచనా వేస్తూ, అదే సందర్బంలో మిగిలి పార్టిల్లో ఉన్న నేతల పై ఓ లుక్ వేసి రిపోర్ట్ ఇవ్వాలని జగన్ చెప్పారని పార్టీ వర్గాల్లో రెండు రోజులు టాక్ నడుస్తోంది.
సర్వేలే కీలకం....
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి సర్వే రిపోర్ట్ లను సేకరించే పనిలో ఉండటంతో, ఆ పాతిక మంది ఎవరు అనే విషయాలు తెలుసుకునేందుకు పార్టి నేతలు ఆరాటపడుతున్నారు. అందులో తమ పేరు ఉంటుందా అంటూ చాలా మంది శాసన సభ్యులు సీఎంవో అదికారుల నుండి కూపీ లాగే పనిలో ఉన్నారని అంటున్నారు. అంతే కాదు సర్వేల ఆధారంగానే టిక్కెట్స్ ఉంటాయని అనేక సార్లు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడంతో రాబోయే పరిస్దితులను అంచానా వేసేందుకు నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే కేవలం ఈ పాతిక మంది శాసన సభ్యులతోనే సర్వే అంశాన్ని సరిపెడతారా లేదా, రెండో దఫా జాబితా కూడా ఉంటుందా అనే టెన్షన్ నేతల్లో మొదలైనట్లు కనిపిస్తోంది.