AP Assembly Session Live: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటి వాయిదా - స్పీకర్‌గా నామినేషన్ వేసిన అయ్యన్న
Andhra Pradesh Assembly Session LIVE Updates: ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల తాజా అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
Andhra Pradesh Assembly Session LIVE Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మధ్య విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణం చేయనున్నారు. 9.45 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో మొదట ప్రొటెం స్పీకర్‌ను సభకు పరిచయం చేస్తారు. అనంతరం ఆయన్ని మర్యాదపూర్వకంగా స్పీకర్ సీట్లో కూర్చోబెడతారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు.
ముందుగా హోదా ప్రకారం సీఎం చంద్రబాబు ప్రమాణం చేస్తారు. తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ ప్రమాణం చేయనున్నారు. వీళ్లిదరి తర్వాత ఆల్ఫాబేటిక్ ఆధారంగా ఒక్కొక్కర్నీ పిలించి ప్రమాణం చేయిస్తారు.
సాధారణంగా ప్రతిపక్ష నేతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్షం హోదా ఉన్న పార్టీ లేదు. వైసీపీకి 11 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా రాలేదు. 17 సీట్లు వచ్చి ఉంటే ప్రతిపక్ష హోదా వచ్చేది. ఈసారి ఓడిపోయిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కనందున ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సాధారణ ఎమ్మెల్యేగానే ప్రమాణం చేస్తారు.
175 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 164 సీట్లను కూటమిగా పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన గెలుచుకున్నాయి. వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 164 సీట్లలో టీడీపీ 135 మంది టీడీపీ సభ్యులు, 21 మంది జనసేన సభ్యులు, 8 మంది బీజేపీ సభ్యులు ఉంటారు.
ఇవాళ సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత సాయంత్రానికి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్పీకర్‌గా చేయాలని ఆసక్తి ఉన్న వాళ్లు, లేదా పార్టీలు ఎంపిక చేసిన వ్యక్తులు నామినేషన వేశారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌గా చేస్తారని తెలుస్తోంది. సాయంత్రం ఆయన నామినేషన్ వేయనున్నారు. మెజార్టీ కూటమిదే ఉన్నందున వేరే వాళ్లు అభ్యంతరం చెప్పే అవకాశం లేదు. ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. రెండో రోజు సభలో స్పీకర్ ఎన్నిక జరిపిన తర్వాత ప్రొటెం స్పీకర్ ఆ వ్యక్తిని సీట్లో కూర్చోబెట్టి తను బాధ్యతలను నుంచి తప్పుకుంటారు. స్పీకర్ ఎన్నిక పూర్తైన తర్వాత ఆయనను ఉద్దేశించి సభలో సభ్యులు మాట్లాడతారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. మళ్లీ జులైలో జరిగే బడ్జెట్ కోసం సభ సమావేశం కానుంది.
ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరితో గురవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రస్తుతం సభలో ఉన్న సభ్యుల్లో ఆయనే సీనియర్ కావడంతో ఆయన్ని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారు. చంద్రబాబు సీనియర్ అయినప్పటికీ సభాధ్యక్షుడు కావడంతో తర్వాత స్థానంలో ఉన్న బుచ్చయ్యచౌదరికి ఈ అవకాశం దక్కింది.
Jagan Oath Taking: ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన జగన్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రుల తర్వాత వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. వాస్తవంగా అల్ఫాబేటిక్ ఆర్డర్‌లో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉండాల్సింది కానీ వైసీపీ అభ్యర్థన మేరకు ఆయనతో ముందుగానే ప్రమాణం చేయించారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ముటకట్టుకున్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగాల్సి వస్తోంది.
ప్రమాణం చేసిన 24 మంది మంత్రులు
ఎమ్మెల్యేలుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేశారు.





















