Chandrababu News: చంద్రబాబు పెద్దమనసు! సెక్రటేరియట్ వెళ్తుండగా సడెన్‌గా ఆగిన కాన్వాయ్
Amarvati News: చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి బయలుదేరిన సమయంలో మధ్యలో ఆగారు. అక్కడ సామాన్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Chandrababu Naidu Latest News: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆయన ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఏపీ సచివాలయానికి కాన్వాయ్ లో బయలుదేరిన సమయంలో ఒక్కసారిగా చంద్రబాబు కాన్వాయ్ ఆగింది. కాన్వాయ్ లో నుంచి దిగి తన కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలను సీఎం చంద్రబాబు కలిశారు. ఇలా చంద్రబాబు కారు దిగగానే అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు. కారు దిగి వారందరినీ చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు.
వారి సమస్యలు వినడంతోపాటు వారి నుంచి వినతి పత్రాలు తీసుకొని నేనున్నానని ధైర్యాన్ని నింపి చంద్రబాబు సచివాలయానికి బయలుదేరారు. చంద్రబాబు తమను చూసి కారు దిగడంతో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడూ ఇలా లేదని.. కనీసం బయటకు వస్తే పోలీసులు ఇబ్బంది పెట్టేవారని స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వైఎస్ జగన్ ఎల్లప్పుడూ పరదాలు, బారికేడ్లు లేకుండా బయటికి వచ్చేవారు కాదని గుర్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. అందరి వద్ద వినతులు స్వీకరించిన సీఎం సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. చంద్రబాబు గారు కారు… pic.twitter.com/2ObkW6EwDq
— Telugu Desam Party (@JaiTDP) July 12, 2024