అన్వేషించండి

Amaravati Works : అమరావతి పట్టాలెక్కడానికి అన్నీ అడ్డంకులు తొలగినట్లే - సింగపూర్ కూడా మరోసారి చేయి కలుపుతుందా ?

Andhra Pradesh : అమరావతికి నిధుల సమస్య సహా చాలా అంశాలకు పరిష్కారం లభించింది. సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి సింగపూర్ కన్సార్షియం మళ్లీ ముందుకు వస్తుందా ?

Amaravati Capital : అమరావతి రాజధానిగా ప్రజలు ఎన్నికల ఫలితాల ద్వారా ఓ స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అయితే ఇప్పుడు అసలు సమస్య గతంలో ప్రభుత్వం అనుకున్న విధంగా అమరావతిని నిర్మించగలదా అని. ఎందుకంటే ఐదేళ్ల పాటు అమరవతి ఎక్కడిదక్కడే ఉంది. అంటే పిచ్చి మొక్కలు పెరిగిపోయి అడవిలా మారిపోయింది. అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిని నిర్వీర్యం అయిపోయింది. మళ్లీ బూడిద నుంచి పైకి లేపాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడింది. ఒక్కొక్కటిగా మళ్లీ అమరావతిని ఆయన దారికి తెస్తూ వస్తున్నరు. ముందుగా నిధుల సమస్యను పరిష్కరించుకున్నరు. 

కేంద్రం రూ. పదిహేను వేల కోట్లు ఇవ్వడంతో నిధుల సమస్యకు పరిష్కారం

అమరావతికి అప్పు లేకపోతే నిధులు ఏవైనా ఇప్పటికిప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. పదిహేను వేల కోట్లు అందేలా చేస్తామని బడ్జెట్‌లోనే హామీ ఇవ్వడంతో అమరావతికి నిధుల సమస్య దాదాపుగా పరిష్కారం అయింది. ప్రపంచబ్యాంక్‌తో ఒప్పందాలే మిగిలాయి. అడ్వాన్సులు కూడా కేంద్రం మంజూరు చేయనుంది. ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చివరి దశలో ఉంది. మరో సారి టెండర్లు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించడమే మిగిలి ఉంది. డిజైన్ల కోసం నార్మన్ ఫోస్టర్స్ ను వెనక్కి రప్పిస్తున్నారు. గతంలో అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు అయిన వారందర్ని మళ్లీ సంప్రదిస్తున్నారు. 

జగన్ ఇంటి చుట్టూ ఇనుప కట్టడానికి ఖర్చు రూ. 12 కోట్ల పైనే -అంతా ప్రజా ధనమే ! జీవో రిలీజ్ చేసిన టీడీపీ

సింగపూర్ మళ్లీ వస్తుందా ?

2014లో అధికారంలకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా  2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించింది.   2016లో సింగపూర్ ప్రభుత్వ సాయంతో కొన్ని సంస్ధలు కన్సార్టియంగా ఏర్పడి అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ ఇచ్చాయి.  సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి ముందుకొచ్చాయి.  అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ అండ్ సెంబ్ కార్ప్ కార్పొరేష‌న్ సంస్థ‌లు క‌న్సార్షియంగా ఏర్ప‌డి సీఆర్‌డీఏతో 2017లో  ఒప్పందం చేసుకున్నాయి. ఆదాయంలో 52 శాతం వాటా సింగ‌పూర్ క‌న్సార్షియం తీసుకుంటుంది. మిగిలింది సీఆర్‌డీఏకు ద‌క్కుతుంది.  స్టార్ట‌ప్ ఏరియా అభివృద్ధి ద్వారా 1.15 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్ర‌భుత్వానికి ద‌క్కే అవ‌కాశం ఉంటుంద‌ని అంచనా వేశారు.   ఏటా 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయ‌లు ప‌న్నుల రూపేణా ప్ర‌భుత్వానికి చేర‌తాయ‌ని  లెక్కలేశారు. కొన్నిపనులు కూడా చేపట్టారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే   ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. దాంతో అమరావతి ఒప్పందాలకు పూర్తిగ ఎండ్ కార్డ్ పడినట్లయింది. 

ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే

సింగపూర్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయా ?

 ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వ సాయంతో తిరిగి సీడ్ క్యాపిటల్ అభివృద్ధి చేయాలని   సీఆర్డీయే సమావేశంలో చర్చించారు.  అయితే  అప్పట్లో ఈ ప్రాజెక్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి ఈశ్వరన్ ఇప్పుడు  అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లారు. ప్రభుత్వాల్లో నిలకడ లేకపోవడం వల్ల మరోసారి సింగపూర్ అమరావతిక ఒప్పందానికి వస్తుందన్న గ్యారంటీ లేదు. కానీ ఒప్పించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సింగపూర్ కన్సార్షియం కూడా వెనక్కి వస్తే అమరావతిని పూర్తి స్థాయిలో పట్టాలెక్కించినట్లే అనుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget