అన్వేషించండి

అవినీతి అధికారుల చిట్టా రెడీ చేసిన ఏసీబీ- ఇప్పటికే జిల్లాల్లో మొదలైన రైడ్స్

రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారుల చిట్టాను ఏసీబీ రెడీ చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికై రైడ్ కూడా మొదలు పెట్టిందని సమాచారం

అక్రమార్జన, అక్రమ ఆస్తులను కలిగి ఉన్న అధికారులపై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తోంది. అవినీతి పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని సబ్-రిజిస్ట్రేషన్ ఆఫీసుపై ఏసీబీ ఆకస్మికంగా దాడులు చేసింది. అవినీతి నిరోధక శాఖ అదికారులు వచ్చే సమయానికి ఎవరు ఎక్కడ ఉన్నారో వారిని అక్కడే ఉంచేశారు. పూర్తిగా సోదాలు పూర్తయ్యే వరకు ఎవ్వరిని కదలనివ్వలేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక సామాన్యులు ఆందోళనకు గురయ్యారు. 

కార్యాలయంలో రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న అజ్జా రాఘవరావు కార్యాలయం, నివాసంపై  ఏసీబీ రైడ్ చేసింది. ఏకాలంలో సోదాలు చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాఘవరావు పని చేస్తున్నారు. ఆయన అక్రమంగా స్థిర, చరాస్తులు ఆర్జించారని సమాచారంతో అధికారులు దాడులు చేశారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విజయవాడ అవినీతి నిరోధక శాఖ అధికారులు కలిసి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఏకకాలంలో ఆయన నివాసం, కార్యాలయంతోపాటు ఇతర నాలుగు ప్రదేశాల్లో కూడా సోదాలు చేశారు.

కర్నూలులో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో రైడ్స్‌ జరిగాయి. కర్నూలు జిల్లాలోని డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్- రిజిస్ట్రార్ ప్రేమరపోగు సుజాతకు చెందిన ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. కర్నూలు నగరంలోని ఐదు ప్రాంతల్లోని ఆమె బంధువుల ఇళ్ళలో తనిఖీలు చేపట్టారు. కర్నూలు అవినీతి నిరోధక శాఖ విభాగం అధికారుల బృందం రెండు రోజులుగా సోదాలు నిర్వహించింది. 

రెండు రోజులుగా సాగిన తనిఖీల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రేమరపోగు సుజాత వద్ద భారీగా ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలులోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక G+2 ఇల్లు
కర్నూలు టౌన్ అశోక్ నగర్ కాలనీలో ఒక G+1 ఇల్లు
కర్నూలు టౌన్ కస్తూరి నగర్ కాలనీలో ఇల్లు
కర్నూలు టౌన్‌ బుధవారిపేటలో G+1 దుకాణంతో కూడిన ఇల్లు 
కర్నూలు టౌన్‌ బుధవారిపేటలో మరో దుకాణం
కర్నూలు మండలం సుంకేసుల గ్రామంలో 2.50 ఎకరాల వ్యవసాయ భూమి 
కర్నూలు పట్టణం శివారు ప్రాంతంలో రూ.23,16,000 విలువ చేసే ఎనిమిది ఇళ్ల స్థలాలు 
40 తులాల బంగారం
ఒక ఫోర్ వీలర్ (టాటా విస్టా) కారు 
ఒక 2 వీలర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు
ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, బంగారం, గృహోపకరణాలు, రూ. 8,21,000/- నగదును ఇప్పటి వరకు గుర్తించామని అధికారులు చెబుతున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని అవినీతి నిరోధక శాఖ ప్రకటించింది.

అవినీతి అధికారులపై ఫిర్యాదు కోసం 14400.
ఎవరైనా అధికారులు వేధిస్తే అవినీతి నిరోధక శాఖ అందుబాటులో ఉంచిన 14400 నెంబర్‌కు సంప్రదించవచ్చని డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్న అధికారులు చిట్టాను ఏసీబీ అధికారులు రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా శాఖల్లో హై టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఎవరి ఇంటిపై అధికారులు పడతారో అన్న భయంతో కొందరు అవినీతి అధికారులు కాలం గడుపుతున్నారని జిల్లాల్లో చర్చ నడుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Embed widget