News
News
వీడియోలు ఆటలు
X

Ambati Rayudu : సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు - రాజకీయాల్లోకి వస్తున్నారా? క్రికెట్ అకాడెమీ పెడుతున్నారా ?

అంబటి రాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైసీపీలో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తన్నాయి.

FOLLOW US: 
Share:

Ambati Rayudu :  ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న క్రికెటర్ అంబటి రాయుడు తాడేపల్లిలో సీఎం జగన్ కలిశారు. బుధవారం రాత్రి మ్యాచ్ ఆడిన ఆయన ఉదయం తాడేపల్లిలో సీఎం జగన్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఇటీవలి కాలంలో సీఎం జగన్ ను ప్రశంసిస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందని కొన్ని మీడియా సంస్థలకు చెప్పారు. అలాగే క్రికెట్ అకాడెమీ కూడా పెట్టాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తో భేటీ చర్చనీయాంశమవుతోంది. 

అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయిన అంబటి రాయుడు 

అంబటి రాయుడు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన దేశంలో సినిమా, క్రికెట్ స్టార్లకు ఉన్నంత క్రెజ్ ఎవరికీ ఉండదు. ఇక లోకల్ టాలెంటెడ్ ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబటి రాయుడు.. అనుకున్న విధంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోయాడు. కెరీర్‌లో వేసిన అనేక తప్పటడుగులు..రిటైర్మెంట్ల ప్రకటనలు.. వివాదాలు ఇలా అనేక మజిలీల తర్వాత ఇప్పుడు ఆయన చూపు పొలిటికల్ కెరీర్ వైపు పడింది. ప్రస్తుతం ఐపీఎల్ అయిన తర్వాత ఆయన గేమ్ నుంచి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల వైపు చూడాలని అనుకుంటున్నరు. ఈ విషయాన్ని ఆయనే చెబుతున్నారు. 

రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న రాయుడు 

గుంటూరులో పుట్టిన అంబటి  రాయుడు రాజకీయాల్లోకి రావాలని చాన్నాళ్ల నుంచి ఆలోచిస్తున్నారు.  ప్రజలకు సేవ చేసేందుకు ఇదే ఉత్తమ మార్గం అనుకుంటున్నానని  కొందరిని కలిసిన తర్వాత తుది నిర్ణయం చెబుతానంటున్నారు.   ఏ పార్టీలో చేరాలన్నది కూడా అప్పుడే తెలుస్తుంది’ అని రాయుడు చెప్పాడు. హైదరాబాద్‌‌‌‌లో క్రికెటర్‌‌‌‌ కెరీర్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేసినప్పటికీ  తెలంగాణలో కాకుండా ఏపీలోనే పొలిటికల్‌‌‌‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.  ఏపీలో బలమైన కాపు వర్గానికి చెందిన రాయుడు తన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏ పార్టీ అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.  బీఆర్ఎస్ నుంచి అంబటిరాయుడు ఆఫర్ వెళ్లినట్లుగా చెబుతున్నారు.  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఏపీ ప్రెసిడెంట్​ తోట చంద్రశేఖర్‌‌‌‌.. బీఆర్ఎస్‌లో చేరి గుంటూరు పశ్చిమ నుంచి  పోటీ చేయాలని ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. అయితే అంబటి ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.  ఇప్పుడు సీఎం జగన్ ను కలిసినందున వైసీపీలో చేరుతారని భావిస్తున్నారు. 

క్రికెట్ అకాడెమీ పెట్టే ఆలోచన !

వచ్చే ఐపీఎల్‌లో ఆడుతారో లేదో అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికే అంబటి రాయుడు వయుసు  37 ఏళ్లు. ఆయన ఇంకా ఎక్కువ కాలం క్రికెట్ కెరీర్ సాగించడం సాధ్యం కాదు. ఈ ఏడాది ఆయన ఐపీఎల్ ఇన్నింగ్స్ గొప్పగా సాగడం లేదు. వచ్చే సారి టీంలో ఉంచుతారో లేదో కూడాతెలియదు. అందుకే క్రికెట్ అకాడెమీ పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నారని చెబుతున్నారు. దానికి భూమి అడిగేందుకు జగన్ ను కలిశారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే సీఎం జగన్ తో భేటీపై .. అటు అంబటి రాయుడు కానీ ఇటు సీఎంవో కానీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రకటన చేసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Published at : 11 May 2023 02:41 PM (IST) Tags: Ambati Rayudu CM Jagan YCP

సంబంధిత కథనాలు

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

రూమ్‌ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్‌ కేసు ఛేదించిన పోలీసులు

రూమ్‌ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్‌ కేసు ఛేదించిన పోలీసులు

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

టాప్ స్టోరీస్

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం