Kannababu : లోకేశ్ సవాళ్లు చిన్న పిల్లల సవాల్- నిఘా వ్యవస్థను టీడీపీ భ్రష్టు పట్టించింది : మంత్రి కన్నబాబు
గత టీడీపీ ప్రభుత్వం ప్రాథమిక హక్కు ఉల్లంఘనకు పాల్పడిందని మంత్రి కన్నబాబు ఆరోపించారు. నిఘా వ్యవస్థను భ్రష్టు పటిస్తూ ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసిందని ఆరోపించారు.
Kannababu : రాష్ట్రంలో నిఘా వ్యవస్థను టీడీపీ(TDP) భ్రష్టు పట్టించిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు(Minister Kannababu) ఆరోపించారు. టీడీపీ దుర్మార్గమైన పరిపాలన చేసిందన్నారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswararao)పై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. పెగాసస్(Pegasus) సాఫ్ట్ వేర్ వినియోగంపై హౌస్ కమిటీ వెయ్యడం సంతోషకరమన్నారు. తండ్రి రోడ్లు పైన ఉంటే కొడుకు సవాళ్లు విసురుతున్నారని లోకేశ్ ను ఉద్దేశించి అన్నారు. ఈ పెగాసస్ విషయంలో స్టేలు ఉండవన్నారు. ఆధారాలతో సహా దొరికిపోతారన్నారు. హౌస్ కమిటీ వెయ్యడం మంచి పరిణామమని కన్నబాబు అన్నారు. లోకేశ్(Lokesh) అప్పట్లో ఐటీ శాఖా మంత్రిగా ఉన్నారని, వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. టీడీపీ విచారణకు ఎందుకు భయపడుతోందని కన్నబాబు ప్రశ్నించారు. లోకేశ్ సవాళ్లు చిన్న పిల్లల సవాల్ గా ఉందన్నారు. నిఘా పెట్టడం అంటే ప్రజల ప్రాథమిక హక్కు ఉల్లంఘనేనని తేలిగ్గా మాట్లాడవద్దన్నారు.
పెగాసస్ పై హౌస్ కమిటీ
పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం(Tammineni Sitaram) మాట్లాడుతూ పెగాసస్‌పై హౌస్ కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ హౌస్ కమిటీ విచారణ చేపడుతుందని తెలిపారు. దీనికీ సంబంధించి కమిటీ సభ్యులను రెండ్రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం రూ.25 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ స్పై వేర్‌ను కొనుగోలు చేసిందనేది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Benerji) స్వయంగా వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై హౌస్ కమిటీ వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని అసెంబ్లీలో ప్రకటించారు.
మంత్రి బుగ్గన కామెంట్స్
సభాసంఘం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పెట్టే ముందు ఆర్థిక, సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy) మాట్లాడారు. చంద్రబాబు స్పైవేర్ కొనుగోలు చేశారని మమతా బెనర్జీ చెప్పారని ఆయన కూడా పేర్కొన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం అన్నారు. చంద్రబాబు అనైతిక రాజకీయాలు చేశారని విమర్శించారు. స్పైవేర్‌ను అనైతిక చర్యలకు వాడతారు కాబట్టి .. అనైతికంగా చేశారు కాబట్టి రుజువులు ఉండవని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. పెగాసస్ అంశంపై సభ్యుల్లో ఆందోళన ఉందని మంత్రి తెలిపారు. పెగాసస్‌తో ఏమేమి చేశారో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : Pegasus In AP Assembly : పెగాసస్‌పై ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ - ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని లోకేష్ సవాల్ !