అన్వేషించండి

Pegasus In AP Assembly : పెగాసస్‌పై ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ - ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని లోకేష్ సవాల్ !

పెగాసస్ అంశంపై విచారణకు ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మమతా బెనర్జీ చెప్పారు కాబట్టి చంద్రబాబు కొనే ఉంటారని వైఎస్ఆర్‌సీపీ సభ్యులు ఆరోపించారు.

పెగాసస్ స్పైవేర్ ( Pegasus ) అంశంపై విచారణ జరిపేందుకు హౌస్ కమిటీని ( house Commiite ) నియమిస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. విపక్ సభ్యులను ఉదయమే సస్పెండ్ చేయడంతో సభలో వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) సభ్యులు మాత్రమే ఉన్నారు. సభా కమిటీకి అందరూ అంగీకరించడంతో ఆ మేరకు స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. రెండు రోజుల్లో సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది. 

చంద్రబాబు కొనుగోలు చేశారని మమతా బెనర్జీ చెప్పారన్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ! 

చంద్రబాబు ( Chandrababu ) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పినట్లుగా చెబుతున్న వార్తలపై ఏపీ అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగింది. ఉదయం టీడీపీ సభ్యులను సస్పెండ్ ( Suspend ) చేసిన తర్వాత పెగాసస్ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని వైఎస్ఆర్‌సీపీ సభ్యులు కోరారు. దీనికి స్పీకర్ తమ్మినేని సీతారాం అంగీకరించారు. ఆ తర్వాత పలువురు వైఎస్ఆర్‌సీపీ సభ్యులు మాట్లాడారు. మమతా  బెనర్జీ సమాచారం లేకుండా మాట్లాడరు కదా అని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేశారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మంత్రి ఆదిమూలపు సురేష్, గడికోట శ్రీకాంంత్ రెడ్డి వంటి సభ్యులు మాట్లాడారు. అందరూ విచారణకు డిమాండ్ చేశారు. 

అనైతికంగా చేశారు కాబట్టి రుజువులు ఉండవన్న మంత్రి బుగ్గన !

సభాసంఘం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పెట్టే ముందు ఆర్థిక, సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ( Buggana ) మాట్లాడారు. చంద్రబాబు స్పైవేర్ కొనుగోలు చేశారని మమతా బెనర్జీ చెప్పారని ఆయన కూడా పేర్కొన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం అన్నారు. చంద్రబాబు అనైతిక రాజకీయాలు చేశారని విమర్శించారు. స్పైవేర్‌ను అనైతిక చర్యలకు వాడతారు కాబట్టి .. అనైతికంగా చేశారు కాబట్టి రుజువులు ఉండవని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. పెగాసస్ అంశంపై సభ్యుల్లో ఆందోళన ఉందని మంత్రి తెలిపారు. పెగాసస్‌తో ఏమేమి చేశారో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. 

Pegasus In AP Assembly : పెగాసస్‌పై ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ - ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని లోకేష్ సవాల్ !

ఎలాంటి విచారణకైనా సిద్ధమని నారా లోకేష్ సవాల్!

పెగాసస్ అంశంపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని టీడీపీ నేత నారా లోకేష్ ( Nara Lokesh ) సవాల్ చేశారు. అసలు చంద్రబాబు స్పైవేర్ కొన్నారని మమతా బెనర్జీ ( Mamata Benarjee ) అన్నారో లేదో ఎవరికీ తెలియదన్నారు. అసెంబ్లీలో అన్నారని చెబుతున్న వీడియో బెంగాలీలోలో ఉందని..  బెంగాలీ భాష తెలిసిన వాళ్లు.. అసలు అందులో పెగాసస్ అంశంపైనే మాట్లాడలేదని చెబుతున్నారన్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget