News
News
X

Ali Daughter's Marriage: కూతురు వివాహానికి సీఎం జగన్‌ను ఆహ్వానించిన అలీ- పెళ్లి పత్రిక తొలి ప్రతి అందజేత!

Ali Daughter's Marriage: ప్రముఖ నటుడు అలీ సతీ సమేతంగా వెళ్లి సీఎం జగన్ కు.. తమ కూతురి పెళ్లి పత్రిక మొదటి ప్రతిని అందజేశారు. సీఎం కూడా కచ్చితంగా పెళ్లికి హాజరవుతానని ప్రకటించినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 

Ali Daughter's Marriage: టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అలీ సతీసమేతంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.యస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు. ఈ మధ్యే అలీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహా దారుగా నియమించిన సంగతి తెలిసిందే. అలీ తన భార్య జుబేదాతో కలిసి బుధవారం ముఖ్యమంత్రిని కలిశారు. అలీ పెద్దకూతురు ఫాతిమా వివాహం నిశ్చయం అవడం, ఇటీవలే హైదరాబాద్‌లో ఘనంగా నిశ్చితార్థం జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అలీ వివాహ ఆహ్వాన పత్రిక తొలి ప్రతిని సీయం జగన్‌మోహన్‌ రెడ్డికి అందించారు. పెళ్లి పత్రిక స్వీకరించిన జగన్, తప్పకుండా వివాహానికి వస్తాను అని మాటిచ్చారని తెలుస్తుంది.

ఏపీలో మరో సలహాదారుగా నటుడు అలీని నియమిస్తూ సీఎం జగన్ ఇటీవేల ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవికి అలీని ఎంపిక చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల అలీ సంతోషం వ్యక్తం చేశారు. జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. 

జగన్ కు థాంక్స్ చెబుతూ అలీ, జుబేదా వీడియో రిలీజ్ 

ఇప్పటికే ఇద్దరు సలహాదారులతో ఉన్న మీడియా వింగ్‌కు మరో సలహాదారుగా హస్యనటుడు అలీని వైసీపీ ప్రభుత్వం నియమించింది. దీనిపై నటుడు అలీకి వైసీపీ ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. తనపై నమ్మకంతో జగన్ తనను గౌరవిస్తూ ఇచ్చిన పదవి పట్ల నటుడు అలీ ఆనందం వ్యక్తం చేశారు. సతీసమేతంగా ధన్యవాదాలు తెలిపారు. భార్య జుబేదాతో కలసి ఓ వీడియోను రిలీజ్ చేశారు నటుడు అలీ. జగన్ ఇచ్చిన గౌరవానికి సంతోషంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు అలీ దంపతులు వివరించారు. పార్టీ ఏర్పాటు నుంచి జగన్‌తో తన ప్రయాణం కొనసాగిందని, ఈ సందర్భంగా అలీ గుర్తు చేసుకున్నారు. పార్టీలో చేరి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన సమయంలో కూడా జగన్‌ను కలసినప్పుడు అండగా ఉంటానని, తగిన న్యాయం చేస్తానని హమీ ఇచ్చారని తెలిపారు. ఆ తరువాత కూడా పార్టీలో విధేయుడిగా కొనసాగుతున్న తన పట్ల ప్రత్యేక అభిమానం చూపించారని అన్నారు. 

News Reels

రాజ్యసభ, ఎమ్మెల్సీ అంటూ చాలా మంది ప్రచారం చేశారని అయితే పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు తాను కామెంట్స్ చేయనని మెదట్లోనే చెప్పానన్న విషయాన్ని ఆలీ గుర్తు చేశారు. పదవులు, హోదాలు, ఆశించి తాను పార్టీలో కొనసాగబోనని గతంలోనే జగన్‌కు వివరించానని ఆలీ స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా జగన్ తనను నియమించి బాధ్యతలను అప్పగించటం ఆనందంగా ఉందన్నారు. జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేసిన విషయాన్ని ఆలీ గుర్తు చేసుకున్నారు.

షుక్రియా జగన్ భాయ్: జుబేదా 

జగన్‌కు అలీ భార్య జుబేదా కూడా ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది చాలా సార్లు అడుగుతున్నారని, వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియలేదని జుబేదా సంతోషంతో అన్నారు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని, తమ ఇంటిలో పండుగ వాతావరణం నెలకొందని జుబేదా వివరించారు. జగన్ ఇచ్చిన అవకాశంతో అందరికి సమాధానం దొరికిందని ఆమె కామెంట్‌ చేశారు. 

Published at : 02 Nov 2022 10:34 PM (IST) Tags: AP News Actor Ali Cine Actor Ali Meet CM Jagan CM Jagan And Ali Ali Daughter Marriage

సంబంధిత కథనాలు

AP New CS : ఏపీ నూతన సీఎస్ గా మరోపేరు తెరపైకి, ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం!

AP New CS : ఏపీ నూతన సీఎస్ గా మరోపేరు తెరపైకి, ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం!

Ganta In YSRCP : వైఎస్ఆర్‌సీపీలో చేరే యోచనలో గంటా - డిసెంబర్ 1న నిర్ణయం ప్రకటించే అవకాశం !

Ganta In YSRCP :  వైఎస్ఆర్‌సీపీలో చేరే యోచనలో గంటా - డిసెంబర్ 1న నిర్ణయం ప్రకటించే అవకాశం !

AP TDP: బీసీ మంత్రులను డమ్మీలను చేసి, వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనాలా?: టీడీపీ నేతలు ఫైర్

AP TDP: బీసీ మంత్రులను డమ్మీలను చేసి, వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనాలా?: టీడీపీ నేతలు ఫైర్

NTR District News : కరెంట్ కట్ చేశారని కన్నీళ్లు పెట్టుకున్న సర్పంచ్

NTR District News :  కరెంట్ కట్ చేశారని కన్నీళ్లు పెట్టుకున్న సర్పంచ్

YV Subbareddy: మహిళలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ తలెత్తుకుని బతికేలా చేసింది రాజ్యాంగం: వైవీ సుబ్బారెడ్డి 

YV Subbareddy: మహిళలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ తలెత్తుకుని బతికేలా చేసింది రాజ్యాంగం: వైవీ సుబ్బారెడ్డి 

టాప్ స్టోరీస్

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

YSRCP BC Leaders : డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !

YSRCP BC Leaders :  డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !