By: ABP Desam | Updated at : 22 Apr 2022 03:29 PM (IST)
ఎవర్నీ వదిలి పెట్టేది లేదన్న ఏబీవీ
ఏ సైకో కళ్లల్లో ఆనందం కోసం తనను వేధించారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో తన సస్పెన్షన్ ను రద్దు చేస్తూ తీర్పు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అర్థరాత్రి తనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని.. తనపై దుష్ఫ్రచారాలు చేశారని ఆరోపించారు. తన సస్పెన్షన్‌పై చట్ట ప్రకారం పోరాడానని.. అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా తప్పేనా అని ప్రభుత్వంపై విమర్శించారు. తనను.. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఏం సాధించారని ఆయన మండిపడ్డారు. తన సస్పెన్షన్‌ను ఆరు నెలలకోసారి పొడిగించారని.. లాయర్ల కోసం రూ. కోట్లు ఖర్చు పెట్టారన్నారు.
వైఎస్ఆర్‌సీపీతో కాంగ్రెస్ పొత్తు ! పీకే సిఫార్సు ఆచరణలోకి వచ్చే చాన్సుందా ?
తన విషయంలో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించానని ఏబీవీ ప్రకటించారు. తన సస్పెన్షన్‌ను కొనసాగించేందుకు లాయర్ల కోసం ఖర్చు పెట్టినదంతా ప్రజాధనమేనని.. ఇదంతా దుర్వినియోగమేనన్నారు. ఇలా జరగడానికి కారణమైన అధికారుల దగ్గర నుంచి మొత్తం రికవరీ చేయాలన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఎవరని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఏ బావ కళ్లలో ఆనందం చూడటానికి..ఏ సైకో ఆనందపడటానికి ఇలా చేశారని అడిగారు.
రాష్ట్రం శ్రీలంకలా ఉందట, ఉచిత పథకాలు ఆపేయాలట- విపక్షంపై జగన్ పంచ్‌లు
ఒక డీజీపీ ఇచ్చిన ఫోర్జరీ మెమో ఆధారంగా.. ఒక ఏడీజీ సీఐడీ రాయించిన తప్పుడు రిపోర్ట్ ఆధారంగా అప్పట్లో ఉన్నప్రముఖులు.. చీఫ్ సెక్రటరీలు ఏమీ చదవకుండానే సంతకాలు పెట్టి 24 గంటల్లో సస్పెన్షన్ రెడీ చేయించారు. తప్పుదారి పట్టించిన అధికారుల ప్రవర్తనను సాక్ష్యాలతో సహా ప్రభు్తవానికి నివేదించానని..ఇంత వరకూ చర్యలు తీసుకోలదేన్నారు. అసలు కొనుగోలే జరగని వ్యవహారంలో ఎలా అవినీతి జరుగుతుందని ఒక్కరికి కూడా డౌట్ రాలేదని.. మీకు వృత్తి నైపుణ్యాలు లేవా అని సీనియర్ అధికారులను ఏబీవీ ప్రశ్నించారు.
రెండేళ్లకు మించి సస్పెన్షన్ పొడిగించడానికి అవకాశం లేదని సీఎస్‌కు లేఖ రాసినా స్పందించలేదని.. ఆయనకు రూల్స్ తెలియవా అని ఏబీవీ మండిపడ్డారు. తాను లోకల్ అని.. తనకు అన్యాయం చేసిన వారిని వదిలి పెట్టే ప్రశ్నే లేదన్నారు. మరో రెండేళ్ల వరకూ ఏబీవీకి సర్వీస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
YSRCP Gajuwaka : వైసీపీలో వరుస రాజీనామాలు - ఆళ్ల తర్వాత గాజువాక ఇంచార్జ్ గుడ్ బై !
Top Headlines Today: వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రాజీనామా! తెలంగాణలో సీఎం క్యాంప్ ఆఫీసు మార్చుతారా?
Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !
Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్
What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది ?
Nelson Dilipkumar: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్
Salaar Runtime: ‘సలార్’ నుంచి మరో కీలక అప్ డేట్, మూవీ రన్ టైమ్ ఎంతో తెలుసా?
Spirit Movie : ప్రభాస్ 'స్పిరిట్'లో ‘యానిమల్’ బ్యూటీ తృప్తి దిమ్రి? ఇదిగో క్లారిటీ!
Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రలో బ్రహ్మణీ, దేవాన్ష్, మోక్షజ్ఞ
/body>