By: ABP Desam | Updated at : 18 May 2023 02:04 PM (IST)
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం - వెకేషన్ బెంచ్‌లో విచారణకు నిర్ణయం ! ( Image Source : PTI )
YS Viveka Case : వివేకా హత్య కేసు నిందితుడు గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెయిల్‌ను రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఉత్తర్వులను పరిశీలించిన సీజేఐ ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వెకేషన్ బెంచ్‌కి బదిలీ చేసింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చేవారం విచారణ జరపనుంది.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి స్టేట్‌మెంట్ ఇచ్చాను - ఆ వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న అజేయకల్లాం !
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ విషయమై వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ గత నెల 27న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో....జూలై 1న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని తన ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. దీన్ని వ్యతిరేకిస్తూ సునీతారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. డీఫాల్ట్ బెయిల్‌పై బయట ఉన్నప్పుడు గంగిరెడ్డి తనకు కోర్టు ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేసిన ఉదంతాలు ఉన్నాయని తన పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. ఎర్రగంగిరెడ్డి ని ఫలానా తేదీన విడుదల చేయాలంటూ ఇచ్చిన తీర్పుపై వేకేషన్ బెంచ్ విచారణ జరిపి తీర్పు వెల్లడించనుంది.
పేదల భుజాలపై నుంచి అమరావతిపై గురి పెట్టారా ? కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే పేదల పరిస్థితేమిటి ?
మరో వైపు అవినాష్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడి ఓ గంట ముందే చేరుకుంటున్నారు. కానీ అరెస్ట్ మాత్రం చేయడం లేదు. అరెస్ట్ చేయకుండా అవినాష్ రెడ్డి హైకోర్టు టు సుప్రీంకోర్టు తిరుగుతూనే ఉన్నారు. తాజాగా ఆయన బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి తరపు లాయర్ నిరంజన్ రెడ్డి చీఫ్ జస్టిస్ ముందు అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ గురించి మెన్షన్ చేశారు. అయితే విచారణకు తేదీ ఇవ్వడానికి చీఫ్ జస్టిస్ నిరాకరించారు. అత్యవసరం అయితే రాతపూర్వకంగా ఇవ్వాలని దాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారణ జరుపుతుంది. ఇప్పుడు అత్యవసరంగా విచారణ జరపాలని అవినాష్ రెడ్డి కోరే అవకాశం ఉంది.
Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?
Academic Calendar: ఏపీ స్కూల్స్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
Perni Nani: ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు - పొగడ్తలతో ముంచెత్తిన పేర్ని నాని
Chandrababu comments : 9 నెలల తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణం పరుగులు - మంత్రులకు తనను తిట్టడమే పనన్న చంద్రబాబు !
Kodela Sivaram : ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం - పట్టు వీడని కోడెల శివరాం !
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్