Singapore Crime: సింగపూర్‌లో కాల్ గర్ల్స్ బుక్ చేసుకుని వాళ్లను దోపిడీ చేసిన ఇద్దరు భారతీయు టూరిస్టులు - ఐదేళ్ల జైలు, 12 బెత్తం దెబ్బల శిక్ష !
Singapore: సింగపూర్‌లో కాల్ గర్ల్స్‌ను బుక్ చేసుకుని వారిపై దాడి చేసి చోరీ చేసిన ఇద్దరు భారతీయ యువకులు. వారికి సింగపూర్ కోర్టు 5 సంవత్సరాల 1 నెల జైలు, 12 బెత్తం దెబ్బలు శిక్ష విధించింది.

2 Indians on Singapore trip rob and assault sex workers: వేసవి సెలవులను ఎంజాయ్ చేయాలని సింగపూర్‌కు వచ్చిన ఇద్దరు భారీయ యువకులు, అక్కడ వేశ్యలపై దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో పాల్పడిన ఆరోక్కియసామి డైసన్ (23), రాజేంద్రన్ మయిలరసన్ (27)లకు సింగపూర్ కోర్టు శుక్రవారం 5 సంవత్సరాల 1 నెల జైలుతో పాటు ప్రతి ఒక్కరికీ 12 బెత్తం దెబ్బలు శిక్షగా విధించింది. ఈ ఇద్దరూ తమ దగ్గర డబ్బులు లేకపోవడమే కారణంగా ఇలాంటి నేరానికి పాల్పడ్డామని కోర్టులో తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ 24న భారత్‌లోంచి సింగపూర్‌కు ఈ ఇద్దరు యువకులు వచ్చారు. రెండు రోజుల తర్వాత ఏప్రిల్ 26న లిటిల్ ఇండియా ప్రాంతంలో తిరుగుతుండగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి వారిని ఆపి, కాల్ గర్ల్స్ సేవలు కోరుకుంటున్నారా అని అడిగాడు. అవునని వీరిద్దరూ చెబితే ఓ నెంబర్ ఇచ్చి వెళ్లాడు. ఆ నెంబ్ర ను సంప్రదించిన ఈ ఇద్దరు యువకులు కాల్ గర్ల్స్‌కు బేరం మాట్లాడుకుని హోటల్‌కు పలిచారు.
సాయంత్రం సుమారు 6 గంటలకు, మొదటి కాల్ గర్ల్‌ను జలాన్ బెసార్‌లోని ఒక హోటల్ రూమ్‌కు పిలిచారు. వచ్చిన తర్వాత ఇద్దరూ ఆమె చేతులు, కాళ్లు దుస్తులతో కట్టేశారు. ఆమె ముఖంపై కొట్టి ఆమె ఆభరణాలు, 2,000 సింగపూర్ డాలర్లు .. అంటే మన రూపాయల్లో సుమారు 1.25 లక్షల రూపాయలు క్యాష్, పాస్‌పోర్ట్, బ్యాంక్ కార్డులు దోచుకున్నారు. ఈ దాడి తర్వాత వారు ఆమెను వదిలేశారు.
అదే రోజు రాత్రి సుమారు 11 గంటలకు, రెండో రెండో కాల్ గర్ల్‌ను డెస్కర్ రోడ్‌లోని మరొక హోటల్ రూమ్‌కు పిలిచారు. ఆమె వచ్చాక చేతులు పట్టుకొని లాగి, రాజేంద్రన్ ఆమె నోటిని మూసేసి కేకలు వదలకుండా చేశాడు. వారు ఆమె నుండి 800 సింగపూర్ డాలర్లు అంటే సుమారు 50 వేల రూపాయలు , రెండు మొబైల్ ఫోన్లు, పాస్‌పోర్ట్ దోచుకున్నారు. వెళ్లే ముందు, హోటల్ రూమ్‌లోనే ఉండాలని.. తిరిగి వస్తామని బెదిరించారు.
ఏప్రిల్ 27న, రెండో బాధిత మహిళ ఈ ఘటనను మరొక వ్యక్తికి చెప్పగా, అతను పోలీసులకు సమాచారం అందించాడు. త్వరగా చర్య తీసుకున్న సింగపూర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సింగపూర్ చట్టం ప్రకారం, ఈ నేరానికి 5 నుండి 20 సంవత్సరాల జైలు , కనీసం 12 బెత్తం దెబ్బలు శిక్ష విధించవచ్చు. కోర్టులో తమ వాదనలు వినిపించుకున్న యువకులు, డైసన్ తండ్రి మరణించారని.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని విలపించాడు. నా భార్య, పిల్లలు భారత్‌లో ఒంటరిగా ఉండి ఆర్థిక కష్టాలు పడుతున్నారు అని రాజేంద్రన్ కన్నీరు పెట్టుకున్నారు. వారు క్షమించాలని కోరారు. కానీ కోర్టు కఠిన శిక్ష విధించింది.





















