The Girlfriend Release Date: ఎంగేజ్మెంట్, పెళ్లిపై రష్మిక సైలెన్స్... కానీ కొత్త సినిమా రిలీజ్ డేట్ చెప్పింది
Rashmika Mandanna Engagement: ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండింగ్ టాపిక్ ఉందంటే... అది విజయ్ దేవరకొండతో రష్మిక ఎంగేజ్మెంట్. దానిపై ఏమీ చెప్పలేదు గానీ... కొత్త సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది రష్మిక.

విజయ దశమి 2025 పండక్కి నేషనల్ వైడ్ ట్రెండింగ్ టాపిక్ అంటే... అది రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఎంగేజ్మెంట్. సైలెంట్‌గా ఇద్దరూ రింగులు మార్చుకున్నారు. కానీ ఆ విషయం బయటకు చెప్పలేదు. వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. ఆ సంగతి కూడా దాచారు. నేరుగా అనౌన్స్ చేయలేదు. కానీ కొత్త సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది రష్మిక.
నవంబర్ 7న రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' విడుదల!
Rashmika Mandanna's The Girlfriend release date: రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ఇందులో ఆమెకు జోడీగా కన్నడ నటుడు, 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. కథానాయకుడి నుంచి దర్శక రచయితగా మారిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ సంస్థలో తెరకెక్కుతోంది. ఈ రోజు (అక్టోబర్ 4న) రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
నవంబర్ 7న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట. విడుదల తేదీ అనౌన్స్ చేయడంతో పాటు కొత్త వీడియో విడుదల చేశారు. సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన 'నదివే', 'ఏం జరుగుతోంది...' పాటలకు మంచి స్పందన లభిస్తోంది. 'ఏం జరుగుతోంది...' పాటను ప్రముఖ గాయని, రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి ఐదు భాషల్లో ఆలపించారు. బాయ్ ఫ్రెండ్ గాళ్ ఫ్రెండ్ రిలేషన్ మీద రూపొందిన చిత్రమిది.
Also Read: నయా 'లేడీ సూపర్ స్టార్'... నయనతార కాదు, ఈవిడ ఎవరో తెలుసా?
WHO IS YOUR TYPE?
— Geetha Arts (@GeethaArts) October 4, 2025
Let's have this conversation with #TheGirlfriend in theaters from NOVEMBER 7th, 2025 ✨
▶️ https://t.co/sBLopcI2iu
In Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam ❤️ #TheGirlfriendOnNov7th#WhoIsYourType@iamRashmika @Dheekshiths @23_rahulr @HeshamAWMusic… pic.twitter.com/e0mJht9RPH
ప్రస్తుతం రష్మిక చేస్తున్న సినిమాలు ఏమిటి?
Rashmika Mandanna Upcoming Movies: 'ది గర్ల్ ఫ్రెండ్' కాకుండా రష్మిక చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. హిందీలో ఆయుష్మాన్ ఖురానా సరసన యాక్ట్ చేసిన ఫాంటసీ హారర్ కామెడీ 'థామా' ఈ నెల (అక్టోబర్ 21న) థియేటర్లలోకి రానుంది. 'పుష్ప', 'పుష్ప 2'తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంట పాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న AA22xA6లో మరోసారి వీళ్ళిద్దరూ కలిసి నటించనున్నారని సమాచారం. అందులో రష్మికది విలన్ రోల్ అని టాక్. మరో రెండు సినిమాలు అనౌన్స్ చేయాల్సి ఉంది.
Also Read: 'కాంతార'ను బీట్ చేసిన 'ఇడ్లీ కొట్టు'... అక్కడ ధనుష్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు!





















