Vijay Devarakonda Rashmika Engagement | రహస్యంగా రష్మిక విజయ్ దేవరకొండ నిశ్చితార్థం | ABP Desam
రౌడీ బోయ్ విజయదేవరకొండకు, నేషనల్ క్రష్ రష్మికకు నిశ్చితార్థం జరిగింది. శుక్రవారం ఉదయం విజయ్ ఇంట్లో ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుకలో విజయ్, రష్మిక రింగ్స్ ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు. పెళ్లి మాత్రం 2026 ఫిబ్రవరిలో చేసుకోవాలని ఇరు కుటుంబాలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎంగేజ్మెంట్ విషయాన్ని మాత్రం అఫీషియల్ గా ఎక్కడా అౌనన్స్ చేయలేదు. ఈ వేడుకను సీక్రెట్ గా ఉంచాలని భావిస్తున్నట్లున్నారు. కొన్నేళ్లుగా విజయ్, రష్మిక ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి హాలీడే స్పాట్స్ కి వేర్వేరుగా వెళ్తూ ఎన్నో సార్లు ఫ్యాన్స్ కి క్లూస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం ద్వారా ఇద్దరూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పనున్నారు. విజయ్ రష్మిక ఇద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు.





















