Top Headlines: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య - తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top News In AP And Telangana:
1. బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య
తెలంగాణ బీసీ నాయకుడు అర్.కృష్ణయ్య మరోసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున ఎన్నిక కానున్నారు. మంగళవారం కృష్ణయ్య నామినేషన్ వేయనున్నారు. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచే నుంచే వైసీపీ తరఫున పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు బీజేపీ నుంచి మరోసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టబోతున్నారు. వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ మధ్య కాలంలో రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఐదు రోజు వారం రోజుల క్రితమే నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారంతో గడువు ముగియనుంది. ఇంకా చదవండి.
2. నంద్యాల జిల్లాలో ఘోరం
ఏపీలో ఘోరం జరిగింది. తనను ప్రేమించలేదనే కారణంతో బాలికపై ఓ ఇంటర్ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పింటించాడు. ఈ దారుణ ఘటన నంద్యాల జిల్లాలో (Nandyal District) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం సామర్లకోటకు చెందిన బాలిక, కలగొట్లకు చెందిన బాలుడు ఇంటర్ చదువుతున్నారు. తనను ప్రేమించాలని బాలుడు కొంతకాలంగా బాలికను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు నందికొట్కూరులోని అమ్మమ్మ ఇంటికి పంపారు. 6 నెలల క్రితం బాలుడు అక్కడికి వచ్చాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. ఇంకా చదవండి.
3. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 5 బిల్లులు, 2 నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభలో ప్రసంగించారు. 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి, 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, మన దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియాగాంధీ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా చదవండి.
4. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత - కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ - అదానీ ఫోటో ముద్రించిన టీషర్టులను ధరించి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ గేట్ వద్దే నిరసన తెలిపారు. టీషర్టులతోనే లోపలికి వెళ్తామని తేల్చిచెప్పగా.. పోలీసులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) సహా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఇంకా చదవండి.
5. తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అప్ డేట్
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు అప్ డేట్ వచ్చింది. గ్రూప్ 2 హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి అధికారులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇంకా చదవండి.