అన్వేషించండి

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Telangana News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ అవతరణ దినోత్సవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Telangana Assembly Session Started: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 5 బిల్లులు, 2 నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభలో ప్రసంగించారు. 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి, 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, మన దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియాగాంధీ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంతో, ఇక్కడ ప్రజలతో సోనియాగాంధీది విడదీయలేని అనుబంధం అని పేర్కొన్నారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ అవతరణ దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించారు. తొలిరోజు 5 బిల్లులు, 2 నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నారు.

'4 కోట్ల బిడ్డల భావోద్వేగం'

2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని.. ఆ రోజు తెలంగాణ పర్వదినం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. నా తెలంగాణ.. కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు నిత్యసత్యం. భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు.. ఆ జాతీ అస్తిత్వమే. అస్తిత్వానికి మూలమైన సంస్కృతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి. తెలంగాణ జాతి భావనకు జీవం పోసింది. తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదు. ప్రజా పోరాటాలకు ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించాం. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి అంటే 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ప్రజల మనోఫలకాల్లో నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగంణంలో ఆవిష్కరించుకుంటున్నాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని విగ్రహాన్ని రూపకల్పన చేశాం.' అని తెలిపారు.

ప్రతిపక్షాలకు విజ్ఞప్తి..

ఆరు దశాబ్దాలుగా రకరకాల రూపాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆనాడు సోనియాగాంధీ.. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న ప్రకటించారు. అధికారికంగా ఇప్పటివరకు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రకటించలేదు. ప్రజల ఆకాంక్షలు గౌరవించలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమ సందర్భంలో యువత గుండెలపై రాసుకున్న టీజీ అక్షరాలను వాహనాలకు పెట్టుకున్నాం. ఉద్యమ కాలంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని మన రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం. తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫురణ కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లిని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నాం. 4 కోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోబోతున్నాం. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఈ ఒక్కరోజు తెలంగాణ సమాజం కోసం సమయం ఇద్దాం. ఇవాళ వివాదాలకు తావు ఇవ్వొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా.' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Also Read: Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Vote Chori Meeting: తెలంగాణలో కాంగ్రెస్ ఓటు చోరీ సభ - సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసమా?
తెలంగాణలో కాంగ్రెస్ ఓటు చోరీ సభ - సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసమా?
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Modi Cabinet Expansion: కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Embed widget