Annadata Sukhibhava Pending Money: అన్నదాత సుఖీభవ పథకం: డబ్బులు పడని రైతులకు గుడ్ న్యూస్, త్వరలో రూ.7 వేలు జమ
Annadata Sukhibhava Scheme : ఏపీ ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం అందింది. కొందరు రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. వారికి త్వరలోనే నగదు జమ అవుతుంది.

Annadata Sukhibhava Scheme | అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకం తీసుకొచ్చింది. ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. ఈ పథకానికి అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున పెట్టుబడి సాయం జమ చేసింది. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఏపీ ప్రభుత్వం రూ.5000, పీఎం కిసాన్ యోజన స్కీమ్ (PM Kisan Samman Nidhi) కింద కేంద్ర ప్రభుత్వం రూ.2000 రైతులకు అందిస్తున్నాయి.
ఆగస్టు 2వ తేదీన ప్రకాశం జిల్లా దర్శిలో చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. అదే రోజు అర్హులైన 44.75 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద నగదు జమ అయినట్లు ఏపీ వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు. 99 శాతానికి పైగా రైతుల ఖాతాల్లో నిధులు జమ కాగా, కొందరి ఖాతాల్లో మాత్రం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ శాఖ గ్రీవెన్స్‌లో 10,915 మంది రైతులు ఫిర్యాదులు నమోదు చేశారు. వీటిలో ఎక్కువ దరఖాస్తులు ఆమోదం పొందాయని రైతులకు శుభవార్త అందించారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. వ్యవసాయ శాఖ ప్రకారం, గ్రీవెన్స్‌లో ఆమోదం పొందిన రైతుల ఖాతాల్లో త్వరలోనే రూ.7 వేలు జమ అవుతుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందుతుందని అధికారులు తెలిపారు.
అన్నదాత సుఖీభవ పథకం అధికారిక వెబ్‌సైట్ http://annadathasukhibhava.ap.gov.inలో మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా మీకు నగదు వచ్చిందా లేదా అని స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సర్వీస్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 95523 00009 వాట్సాప్ నెంబర్‌లో సైతం రైతులు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎందుకు పడలేదంటే..
- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాలు
- NPCI (National Payments Corporation of India) మ్యాపింగ్ సమస్యలు
- ఆధార్-బ్యాంక్ లింక్ తప్పులు
- E-KYC పూర్తి చేయకపోవడం
- భూ యజమాని మృతి & పాస్‌బుక్ అప్‌డేట్ కాకపోవడం
- అనర్హత భూములు (ఆక్వా సాగు, వ్యవసాయేతర భూములు)
- ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల భూములు
ఎవరికి ఈ పథకం వర్తించదు
- ప్రస్తుత లేదా మాజీ ప్రజాప్రతినిధులు
- 10 సెంట్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు
- నెలకు రూ.20 వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు
- మైనర్లు
- E-KYC పూర్తి చేయని వారు
- NPCI మ్యాప్ కాని బ్యాంక్ ఖాతాలు
అన్నదాత సుఖీభవ నగదు కోసం రైతులు ఏం చేయాలి
- మీ గ్రామ రైతు సేవా కేంద్రం లేదా MeeSeva వద్ద వెంటనే E-KYC పూర్తి చేయాలి
- ఆధార్- బ్యాంక్ అకౌంట్ అనుసంధానం సరిచూసుకోవాలి
- బ్యాంక్‌లో NPCI మ్యాపింగ్ చెక్ చేయించాలి
- భూమి పాస్‌బుక్, వారసత్వ పత్రాలు అప్‌డేట్ చేయించాలి






















