Covid Update: ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఒకరు మృతి
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 4,570 మందికి కరోనా నిర్ధారణ అయింది.
ఏపీలో కొత్తగా 30,002 కరోనా పరీక్షలు చేయగా.. 4,570 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా చిత్తూరులో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 669 మంది కోలుకున్నారు. ప్రస్తుతం.. 26,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 1,124, విశాఖ-1,028, గుంటూరు-368, అనంతపురం-347, నెల్లూరు-253, తూర్పుగోదావరి జిల్లాలో 233 కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 16/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 16, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,03,385 పాజిటివ్ కేసు లకు గాను
*20,62,105 మంది డిశ్చార్జ్ కాగా
*14,510 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 26,770#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/HTbp2DAo7O
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,71,202 కేసులు నమోదయ్యాయి. శనివారం కంటే 2,369 కేసులు ఎక్కువగా వచ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 15,50,377కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 16.28గా ఉంది. తాజాగా 1,38,331 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 95.51 శాతంగా ఉంది.
కరోనా కారణంగా ఒక్కరోజులో 314 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 4,86,066కు పెరిగింది.
వ్యాక్సినేషన్..
భారత్లో టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. శనివారం 66,21,395 డోసులు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,76,15,454కు చేరింది.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 42,462 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,64,441కి చేరింది.
కొత్తగా 125 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,730కి చేరింది. ముంబయిలో 11 మంది కరోనాతో మృతి చెందారు. ముంబయిలో కొత్తగా 11 మంది మృతి చెందారు.
Also Read: School Holidays: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. సెలవులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)