అన్వేషించండి
Food Poison: యోగి వేమన వర్శిటీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ - 30 మంది విద్యార్థులకు అస్వస్థత
AP News: కడపలోని యోగి వేమన వర్శిటీలోని ఫుడ్ పాయిజన్ తో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Food Poison in Kadapa Yogi Vemana University Hostel: కడపలోని (Kadapa) యోగి వేమన వర్శిటీలోని (Yogi Vemana Versity) హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి విద్యార్థులు కూర, రసంతో అన్నం తిన్నారు. ఆ తర్వాత వారు వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. దీన్ని గమనించిన యూనివర్శిటీ సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అటు, ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. విద్యార్థి సంఘం నాయకులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
Also Read: టీడీపీ పాలనలో పులివెందులకు నీళ్లు- జగన్ హయాంలో కుప్పానికి జలాలు- ఇదే స్ఫూర్తి రాష్ట్రమంతటా ఉంటే..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion