Today Top Headlines: జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు - సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
‘ఏపీ సీఎం చంద్రబాబు మంచితనంతో మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ సంగతి చూసేవాళ్లం. పేర్ని నానికి ఆడవాళ్లంటే గౌరవం కూడా ఉందా? మా మీద కేసులు పెట్టినప్పుడు పేర్ని నానికి మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకురాలేదా. తప్పు చేశావ్ కాబట్టే నీ మొహంలో రక్తం చుక్క లేదు’ అంటూ మాజీ మంత్రి పేర్ని నానిపై తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడును కూడా ఇబ్బండి పెట్టారు. ఇప్పుడు పేదలకు ఇవ్వాల్సిన బియ్యంలో దొంగ వ్యవహారం చేస్తున్నాడు పేర్ని నాని. మీ నాన్న పిలిచినప్పుడు వెళ్లి చైర్మన్‌ను చేశాం. ఇంకా చదవండి.
2. తిరుమలలో మొదలైన న్యూఇయర్ సందడి
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ఇయర్ ఎండ్ ..కొత్త ఏడాదికి స్వాగతం పలికే ముందు వచ్చిన వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 29 ఆదివారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం సందర్భంగా తిరుమలలో తిరుప్పావై జరుగుతుంది..శ్రీ వేంకటేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ఈనెలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇంకా చదవండి.
3. సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం
తెలంగాణలో కానిస్టేబుళ్ల మరణాలు సంచలనం సృష్టించాయి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేటలోని కలకుంట కాలనీలో బాలకృష్ణ అనే వ్యక్తి, కొల్చారం పోలీస్ స్టేషన్ లో సాయికుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో తమ ప్రాణాలు తీసుకున్నారు. బాలకృష్ణ, ఆయన కుటుంబం ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తుండగా.. సాయి కుమార్ ఆత్మహత్యకి వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. ఇంకా చదవండి.
4. నిరుపేద విద్యార్థికి మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక సాయం
నిరుపేద విద్యార్థిని తన ఉన్నత విద్యకు సాయం చేయాలని రిక్వెస్ట్ చేయగా మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ఆమె చదవుకు ఆటంకం కలగకుండా చూసేందుకు ఆర్థికసాయం చేశారు. ఇటలిలోని ప్రఖ్యాత విద్యాసంస్థ పాలిటెన్సికో డి టోరినో (పాలిటో) లో అర్కిటెక్చర్ కన్ స్ట్రక్షన్ లో మాస్టర్స్ లో విద్యార్థిని ప్రణవి చొల్లేటికి సీటోచ్చింది. తన కుటుంబం చదువు ఖర్చు అంత భరించేస్థితిలో లేదు సర్ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి విద్యార్ధిని విన్నవించింది. ఇంకా చదవండి.
5. బీఆర్ఎస్ చేతికి మరో అస్త్రం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రెవెన్యూ రాబడులు రూ.1 లక్ష కోట్ల మార్కు చేరాయి. నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ఖజానాకు చేరిన పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం సహా గ్రాంట్ల మొత్తం రూ.1.03 లక్షల కోట్లు అయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8 నెలలు గడిచినప్పటికీ రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో సగానికి కూడా చేరుకోలేదు. నవంబర్ నెల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.1.38 లక్షల కోట్లకుపైగా ఉంది. అందుకు తగ్గట్లుగా ఆదాయం లేకపోవడంతో రెవెన్యూ లోటు భారీగానే నమోదవుతోంది. ఇంకా చదవండి.