Crime News : సిద్దిపేట జిల్లాలో విషాదం, ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య
Crime News : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Crime News : తెలంగాణలో కానిస్టేబుళ్ల మరణాలు సంచలనం సృష్టించాయి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేటలోని కలకుంట కాలనీలో బాలకృష్ణ అనే వ్యక్తి, కొల్చారం పోలీస్ స్టేషన్ లో సాయికుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో తమ ప్రాణాలు తీసుకున్నారు. బాలకృష్ణ, ఆయన కుటుంబం ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తుండగా.. సాయి కుమార్ ఆత్మహత్యకి వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు.
కుటుంబంతో కలిసి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సిద్దిపేట జిల్లాలోని కలకుంట కాలనీలో 17వ బెటాలియన్ చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డారు. భార్యకు, పిల్లలకు పురుగుల మందు కలిపి ఇచ్చిన బాలకృష్ణ.. తానేమో పురుగుల మందు తాగాక, ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలకృష్ణ మృతి చెందాడు. ఇక పురుగుల మందు తాగిన భార్యా, ఇద్దరు పిల్లలను గురించిన స్థానికులు.. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ చేపట్టారు.
హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్య
ఇక మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్ లో ఉన్న చేట్టుకు ఉరివేసుకుని హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. క్వార్టర్స్ ఆవరణలోనే సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. అయితే సాయికుమార్ ఆత్మహత్యకి వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. నిన్న అర్థరాత్రి సాయి కుమార్ తన కుటుంబసభ్యులకు ఫోన్ చేశాడని, ఆ తర్వాతే ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. సాయి కుమార్ స్వస్థలం మెదక్ జిల్లా నర్సాపూర్. అయితే అతను నిజంగానే వివాహేతర సంబంధం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదంటే ఇంకేదైనా కారణమా అన్న కోణాల్లోనూ పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.