Today Top Headlines: డిప్యూటీ సీఎం పదవిపై మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు - కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. డిప్యూటీ సీఎం పదవిపై మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవిపై గత కొన్ని రోజులు ఏపీలో రాజకీయం వేడెక్కింది. తనకు డిప్యూటీ సీఎం మంత్రి నారా లోకేష్ స్పందించారు. తాను కార్యకర్తగానే పనిచేస్తానని లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు వైఎస్ జగన్ పై నమ్మకం లేదని, వైసీపీ నేతలకు ఎలా ఉంటుందని ఏపీ మాజీ సీఎంపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం ఎప్పటినుంచో చెబుతున్నాం, డబ్బుల కోసం పార్టీని కూడా అమ్మేసే ఛాన్స్ ఉందన్నారు. 2019 నుంచి 2024 వరకు ప్రజల్లోనే ఉన్న సమయంలో క్లియర్ గా చెప్పాం. ఇంకా చదవండి.
2. టీడీపీ సభ్యత్వం పేరుతో కొత్త తరహా మోసం
ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ రికార్డు స్థాయిలో సభ్యత్వాలను నమోదు చేసింది. కోటికి పైగా సభ్యత్వాలు పూర్తి చేసుకున్నామని పార్టీ నేతలు సైతం ప్రకటించుకున్నారు. మరోవైపు ఇదే అదనుగా కొందరు టీడీపీ నేతలమని చెప్పి నమ్మించి, సభ్యత్వం పేరుతో మహిళ బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారు. శ్రీకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని వసుంధర గ్రామంలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతలుగా పరిచయం చేసుకున్న కొందరు నేతలు జిల్లాకు చెందిన లక్ష్మినాయక్ అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టినట్లు తెలిపారు. ఇంకా చదవండి.
3. విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి లోకేశ్
రాజకీయాల్లో పాదయాత్ర ఎంబీఏ లాంటిదని, స్టాన్‌ఫోర్డ్ లో తన చదువు వ్యాపారం చేయడానికి పనికొస్తుందని నారా లోకేష్ అన్నారు. 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువునష్టం దావా కేసులో ఏపీ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను విశాఖ ఎయిర్‌పోర్టుకు పలుమార్లు వచ్చాను. టీడీపీ ప్రభుత్వం నాపై లాంజ్‌లో రూ.25 లక్షలు ఖర్చుపెట్టిందని సాక్షిలో కథనం వచ్చింది. దీనిపై అప్పట్లోనే పరువునష్టం దావా వేశాను. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే రీజాయిండర్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశాం. వారం తరువాత మాతో ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, రీజాయిండర్ వేస్తామన్నారు. ఇంకా చదవండి.
4. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ ప్రభుత్వంపై అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధును ఎగ్గొట్టామని, రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదు తగగ్గించామని, గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా చదవండి.
5. తెలంగాణలో మరో పరువు హత్య
తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 2023లో ఇబ్రహీంపట్నంలో జరిగిన పరువు హత్య అప్పట్లో ఎంత చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో జనవరి 26 ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుడిని మామిళ్లగడ్డ గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటిగా పోలీసులు గుర్తించారు. ఇంకా చదవండి.





















