Top Headlines: చెక్క పెట్టెలో డెడ్ బాడీ కేసులో సంచలన విషయాలు - తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. ఇంటికి మృతదేహం డెలివరీ కేసులో సంచలన విషయాలు
పశ్చిమగోదావరి జిల్లా (Westgodavari District) ఉండి మండలం యండగండి (Yendagandi) గ్రామంలో ఓ ఇంటికి పార్శిల్‌లో మృతదేహం వచ్చిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన అనుమానితుడు శ్రీధర్‌వర్మ తన వదిన సాగి తులసికి చెందాల్సిన ఆస్తిని కాజేయాలనే ఆలోచనతోనే ఈ పథకం రచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీని కోసం జులై నుంచే ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు కథ నడిపించాడు. అదే క్రమంలో పార్శిల్‌లో శవాన్ని పంపి తులసిని భయపెట్టాలని భావించినట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి.
2. కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం
ఆ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్రిస్మస్ సెలవులకని ఇంటికి వచ్చాడు. సరదాగా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా (Krishna District) గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో (Kouthavaram) బుధవారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగలూరుకు చెందిన కొమ్మాలపాటి సాయికుమార్ (26) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. క్రిస్మస్ సెలవు రావడంతో ఆదివారం సొంతూరికి వచ్చాడు. ఇంకా చదవండి.
3. ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు
2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం అల్లకల్లోలం సృష్టించింది. డజనుకు పైగా దేశాల్లో 2,20,000 కంటే ఎక్కువ మందిని బలిగొన్న ఈ సునామీకి నేటితో 20 ఏళ్లు పూర్తైంది. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం పశ్చిమ తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా భారీ అలలు ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్, హిందూ మహాసముద్ర బేసిన్ చుట్టూ ఉన్న 9 ఇతర దేశాల తీర ప్రాంతాల్లోకి వచ్చాయి. కొన్ని నివేదికల ప్రకారం హిందూ మహాసముద్రంలో ఈ భూకంపం 10 నిమిషాలకు పైగా సంభవించింది. ఇంకా చదవండి.
4. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
టాలీవుడ్ ఇకపై బెనిఫిట్ షోల్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు చిత్రసీమ పెద్దలు ఈ రోజు సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ భేటిలో బెనిఫిట్ షోల గురించి చర్చకు రాగా... తన వైఖరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సూటిగా స్పష్టంగా చెప్పారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి మరణం గురించి తెలంగాణ అసెంబ్లీలో చర్చకు వచ్చింది. తమ ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడేది లేదని, ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంకా చదవండి.
5. కామారెడ్డి జిల్లాలో ఎస్సై, లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్యలు
కామారెడ్డి జిల్లా (Kamareddy District) పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఒకే రోజు ముగ్గురు సిబ్బంది అదృశ్యం కాగా ఇద్దరు చెరువులో విగతజీవులుగా కనిపించారు. ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్ సహా కంప్యూటర్ ఆపరేటర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట ఠాణాలో పనిచేస్తోన్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌గా పని చేస్తోన్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యం కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇంకా చదవండి.