Today Top Headlines: స్వగ్రామంలో సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ
ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) కుటుంబంతో సహా రెండో రోజు స్వగ్రామమైన నారావారిపల్లెలో (Naravaripalle) సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గ్రామదేవత గంగమ్మకు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. నాగాలమ్మపుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. నారా భువనేశ్వరి, లోకేశ్ (Loeksh), బ్రాహ్మణి, దేవాంశ్ ఇతర కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా చదవండి.
2. సంక్రాంతి వేళ పందుల పందేలు అక్కడ స్పెషల్
సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు. ఈ సంబరాల్లో కోడి పందేలు, ఎడ్ల పందేలు మరీ ఫేమస్. ప్రత్యేక బరులను సిద్ధం చేసి మరీ కోడి పందేలు నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివస్తారు. ఈ పందేల్లో రూ.కోట్లలో చేతులు మారుతుంటాయి. తాజాగా, కేరళ తరహాలో పడవ పోటీలను సైతం ఆత్రేయపురంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించారు. ఇన్ని పోటీలున్నా సంక్రాంతి సందర్బంగా పందుల పందేలను సైతం నిర్వహించారు. ఇంకా చదవండి.
3. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు
నిజామాబాద్ జిల్లా (Nizamabad District) రైతుల ఏళ్ల కల నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు (Turmeric Board) నిజామాబాద్‌లోని ఇందూరులో ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి గోయల్‌కు ఆయన శాలువా కప్పి సన్మానించారు. కాగా, జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023, అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ ప్రకటించారు. ఇంకా చదవండి.
4. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట
బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి (Padi Kaushik Reddy) ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కరీంనగర్ (Karimnagar) రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ ప్రేమలత మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. 2 కేసుల్లో రూ.25 వేల చొప్పున రూ.50 వేల పర్సనల్ బాండ్ సమర్పించాలని ఆదేశించారు. ఆయనకు రిమాండ్ విధించాలన్న పోలీసుల రిపోర్టును కొట్టేశారు. అన్ని కేసులు కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. ఇంకా చదవండి.
5. ఇంటి డోర్‌పై యజమాని పోస్ట్ వైరల్
సంక్రాంతి అంటేనే 3 రోజుల పండుగ. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో స్థిరపడిన వారంతా పండుగ రోజుల్లో సరదాగా తమ ఫ్యామిలీతో గడిపేందుకు స్వగ్రామాలకు తరలివెళ్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ వంటి నగరాలు నిర్మానుష్యంగా మారుతాయి. ఇదే అదునుగా కొందరు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. పండుగకు ఊరెళ్లే వారి ఇళ్లల్లో చోరీలకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, దొంగల బారి నుంచి కాపాడుకునేలా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఇంకా చదవండి.