KTR : టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్.. సంక్రాంతి వరకు రైతు బంధు సంబరాలు చేయాలని కేటీఆర్ పిలుపు !
టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్‌గా కేటీఆర్ అభివర్ణించారు. సంక్రాంతి వరకు రైతు బంధు సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు. రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో రూ. 50వేల కోట్లు ఇప్పటి వరకూ జమ చేశామన్నారు.
రైతు బంధు పథకం కింద.. రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకూ రూ. యాభై వేల కోట్లు జమ చేశామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ రోజు తెలంగాణ చరిత్రలొనే కాదు స్వతంత్ర భారత చరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని ఆయన వ్యాఖ్యానిచారు. రైతుల ఖాతాల్లో రూ. యాభై వేల కోట్లు జమ చేయడం ఓ సాహసమన్నారు. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పట్ల కృతజ్ఞతలు ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలని.. రైతు బంధు సంబరాలను సంక్రాంతి దాకా పొడిగిస్తున్నామని ప్రకటించారు. .టీ ఆర్ ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అన్నారు.
రైతులకు ఇంత మేలు జరుగుతుంటే కొందరు పొలిటికల్ టూరిస్ట్ లు రాష్ట్రానికి వచ్చి ఎదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రం లో రైతులకు అన్నీ కష్టాలేనని రైతుల ఆత్మ హత్యల్లో మొదటి స్థానం. దిగుబడుల్లో చివరి స్థానంలో ఉండేవారమన్నారు. ..అపుడు ఊర్లకు ఊర్లె వల్లకాడు గా మారాయన్నారు. కానీ ఇప్పుడు తెలగాణలో ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలే ఉన్నాయన్నారు. వలసల దుస్థితి అంతరించింది, .రైతుల దర్జా పెరిగిందన్నారు. భూముల ధరలు, రియల్ ఎస్టేట్ బాగా పెరిగాయన్నారు. వ్యవసాయానికి కేసీఆర్ ఇచ్చిన ఊతమే రైతు జీవితాలను మార్చిందన్నారు.
రైతు బంధును విమర్శిస్తున్న వారికి కూడా సాయం అందుతోందని కేటీఆర్ ప్రకటించారు. రైతు బంధు పెట్టుబడి సాయం కాంగ్రెస్ నేతల అకౌంట్లలో పడుతోందని.. తన దగ్గర రికార్డులు ఉన్నాయని కేటీఆర్ ప్రకటించారు. ఆసరా పెన్షన్ల ను విమర్శించే రాజకీయ నాయకుల తల్లి దండ్రులు దాన్ని తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. నాలుగు లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశాము. మిగతాది దశల వారీ గా చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ..కాంగ్రెస్ రెండు లక్షల రుణాల మాఫీ చేస్తామన్న ప్రజలు నమ్మకుండా మాకే రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారని.. నిలబెట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతు బీమా కు 3205 కోట్ల మేర ప్రీమియం కట్టామని..70 వేల మంది రైతుల కు రైతు బీమా తో ప్రయోజనం జరిగిందన్నారు. ఇలాంటి పథకం ప్రపంచం లో ఎక్కడైనా ఉందా అని విపక్షాలను ప్రశ్నించారు.
Also Read: ఖమ్మం కాంగ్రెస్‌లో అసలేంటి ఈ పరిస్థితి! తర్జనభర్జనలు పడుతున్న రాష్ట్ర నాయకత్వం
కేంద్రం నుంచి అరపైసా సాయం లేకున్నా కాలం తో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని.. ఇంత వేగంగా కట్టిన ప్రాజెక్ట్ ఇండియాలో ఎక్కడైనా ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఉత్తర, దక్షిణ తెలంగాణల గోస తీర్చే ప్రాజెక్టులన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఐదు విప్లవాల ముంగిట తెలంగాణ ఉందని .. సస్య విప్లవం,వ్యవసాయ విప్లవం గులాబీ విప్లవం(పశు సంపద అభివృద్ధి),శ్వేత విప్లవం, నీలి విప్లవం అని కేటీఆర్ విశ్లేషించారు.
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!