అన్వేషించండి

Telangana News: 67 లక్షల టన్నుల బియ్యం తీసుకోవాలని కోరిన తెలంగాణ - 50 లక్షల టన్నులకే ఓకే చెప్పిన కేంద్రం

Telangana News: తెలంగాణ నుంచి 50 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం సిద్ధమైంది. ఖరీఫ్‌లో వరి దిగుబడి నుంచి సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ  నిర్ణయించింది.

Telangana News: ఏటా కేంద్రం రాష్ట్రాల నుంచి బియ్యాన్ని సేకరిస్తుంది. రాష్ట్రాల పంట దిగుబడిని బట్టి కేంద్రం బియ్యాన్ని సేకరిస్తుంది. ఈసారి కూడా రాష్ట్రాల నుంచి బియ్యం సేకరణకు కేంద్రం కోటా కింద టార్గెట్‌ ఇచ్చింది. తెలంగాణ నుంచి ఈ ఖరీఫ్‌లో వచ్చే వరి దిగుబడి నుంచి 50 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ  నిర్ణయించింది. సోమవారం దిల్లీలో ఈ అంశంపై సమావేశం జరిగింది. బియ్యం సరఫరా ఉన్న రాష్ట్రాల అధికారులతో చర్చలు నిర్వహించారు. 

తెలంగాణ నుంచి ఈ వానాకాలంలో కోటి 52 లక్షల టన్నుల ధాన్యం పంట వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ పంటను మిల్లింగ్‌ చేస్తే దాదాపు 67 లక్షల బియ్యం వస్తుంది. ఈ బియ్యం మొత్తాన్ని కేంద్రం సేకరించాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మాత్రం తెలంగాణ నుంచి 50 లక్షల టన్నుల బియ్యం సేకరణకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం వానా కాలం సాగు, పంట దిగుబడి ఎంత వస్తుందనే అంశంపై అంచనాలు మాత్రమే ఉన్నాయి. వచ్చే నెలలో ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ బియ్యం సేకరణపై వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అంచనాలు మాత్రం వెలువడించింది.

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. వర్షపాతం అనుకూలించడంతో పలు రాష్ట్రాల్లో కలిపి వరి సాగు విస్తీర్ణం దాదాపు 15 లక్షల హెక్టార్ల మేర పెరగగా.. అందులో 30 % వాటా తెలంగాణదే. ఇందులో తెలంగాణ దేశంలోనే మెదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం 4.42 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. కాబట్టి రాష్ట్రంలో వరి పంట దిగుబడి అధికంగానే ఉంటుందని అంచనా ఉంది. 

గత సంవత్సరం ఖరీఫ్‌లో కూడా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ తెంగాణ నుంచి 50 లక్షల టన్నుల బియ్యం సేకరణకు ముందుకు వచ్చింది. కానీ రాష్ట్రం 44 లక్షల టన్నుల బియ్యం పౌర సరఫరాల సంస్థ ఇవ్వగలిగింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget