Anantapur: దళారులు చెప్పిందే ధర, గిట్టుబాటు లేక చీని రైతుల ఆందోళన
తీపి పెంచాల్సిన చీనీ పంట ఈసారి రైతులకు చేదు తినిపిస్తుంది. ప్రస్తుతం పంటకు ధర లేకపోవడంతో రైతుల బతుకులు దుర్భరంగా మారాయి.
తీపి పెంచాల్సిన చీనీ పంట ఈసారి రైతులకు చేదు తినిపిస్తుంది. ప్రస్తుతం పంటకు ధర లేకపోవడంతో రైతుల బతుకులు దుర్భరంగా మారాయి. గత మే నెల తర్వాత ధరలు పెరుగుదల కనిపించడంతో ఆశలు రేకెత్తించిన క్రమంగా తగ్గుతూ రావడంతో నష్టాలే మిగులుతున్నాయి. ఏడాది చీనీ రైతులకు సుమారు 500 కోట్లకు పైగా నష్టం వాటిలికినట్లు అంచనా వేస్తున్నారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుమారు 40 మండలాల్లో 44వేల హెక్టాల విస్తీర్ణంలో చీనీ పంటను రైతులు సాగు చేశారు. వ్యవసాయ పంటలు దారుణంగా దెబ్బతీస్తుండంతో ఇటీవల కాలంలో ఉద్యాన పంతులపై రైతులు దృష్టి సారిస్తున్నారు. అనంతపురం జిల్లా రైతులు ఈ సంవత్సరం చినీ పంట నష్టంతో నిండా మునిగారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట పూర్తిగా దెబ్బతినింది. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన చినీ పంటను అనంతపురం జిల్లాలో పండిస్తారు.
ఈసంవత్సరం చీని పంట చేతికి వచ్చేసరికి ధరలు లేకపోవడంతో రైతులు దిక్కుతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరోవైపు మార్కెట్ యార్డులో దళారులు, వ్యాపారులు డబుల్ సూట్.. పర్సంటేజ్ లతో రైతులను దోపిడీ చేస్తున్నారు. బయట మాత్రం అంత బాగుంటుందని చెప్తున్నా అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం అవి ఏవి కనిపించటం లేదు. ప్రతి ఏటా సుమారు ఒకటన్ను 60 వేల నుంచి 90 వేల వరకు ధర పలికేది. ప్రస్తుతం 20 వేలకు మించి ధర ముందుకు సాగడం లేదు.
దేశంలోనే దేశంలోనే రుచికరమైన చీని పంటను అనంతపురం జిల్లాలో సాగు చేస్తారు. సుమారు లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు అవుతుంది. ఏటా మంచి దిగుబడులు వచ్చి మార్కెట్లో అదే స్థాయిలో ధరలు ఉండేవి. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులకు తోడు పంట సరిగా రాకపోవడం ఇతర పరిస్థితి వల్ల మార్కెట్లో ధరలు పూర్తిగా పతనమయ్యాయి. రైతులు ఎంతో కష్టపడి సాగు చేస్తే అమ్మకానికి వచ్చే ముందు దళారులు వ్యాపారులు రైతు కష్టాన్ని దోచేస్తున్నారు. నాణ్యమైన ఒకటో రకం కాయలు గరిష్టంగా 20000 కనిష్టంగా 16000 అమ్ముడుపోతున్నాయి.
ఒక ఎకరాకు సుమారు లక్ష రూపాయలు వరకు సాగుకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఆరుగాలం పంటను కాపాడుకొని కష్టపడి పండిస్తే పండించిన పంటను దళారులు వ్యాపారులు దోచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. పంటను సాగు చేయాలంటే గతంలో కంటే సాగు పెట్టుబడి చాలా పెరిగిందని మందులు ఎరువులు అధిక ధరలు పెరిగాయని వీటితో సాగు ధరలు ఎక్కువ కావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామన్నారు.
అన్ని భరించి పండించిన పంటను మార్కెట్కు తరలిస్తే అక్కడ వ్యాపారులు దళారులు ఒక్కటై తమ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారన్నారు. అన్నిచోట్ల బహిరంగ వేలంలో చిని కాయలను వేలం వేస్తుంటే అనంతపురంలో మాత్రం అందరూ ఒకే రింగై తక్కువ రేటుకు పాడుతున్నారు. అందులోనూ టన్నుకు 200 కేజీల సూట్ తీసివేయతున్నారు మరియు 10 శాతం కమిషన్ కూడా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకునే ప్రభుత్వం రైతులకు సరైన గిట్టుబాటు ధరలను కల్పించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధరలను స్థిరకరించి అవసరమైతే పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.