ఓజీలోని యకూజా గ్యాంగ్.. చరిత్ర తెలిస్తే వణికిపోతారు
జపాన్.. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది డిసిప్లిన్, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, అండ్ సేఫ్ సొసైటీ. ప్రపంచంలోనే మోస్ట్ పీస్‌ఫుల్ కంట్రీస్‌లో ఒకటి జపాన్. కానీ, ఇంత బ్యూటిఫుల్ అండ్ పీస్‌ఫుల్ కంట్రీలో ఓ చీకటి ప్రపంచం కూడా ఉంది. ఆ ప్రపంచం చాలా సైలెంట్‌గా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఎంతలా అంటే మొత్తం దేశాన్నే తన గుప్పిట్లో పెట్టుకునేటంతలా. దేశాన్ని రూల్ చేసే ప్రధాని పదవి కూడా సొంతం చేసుకునేటంతలా ఎదిగింది. అదే యాకూజా క్రిమినల్ మాఫియా సిండికేట్.
యకుజా మాఫియా ట్రెడిషన్ జపాన్‌లో కొత్తదేం కాదు. ఇది జపాన్ చరిత్రలో 300 సంవత్సరాల నుంచి ఉంది. 17త్ సెంచురీలో చిల్లర దొంగతనాలు, గాంబ్లింగ్ లాంటి క్రైమ్స్ చేసుకునే గ్యాంగ్స్‌నే యకుజా అని పిలిచేవారు. ఈ యాకూజా గ్యాంగ్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యేవి. ఈ గ్యాంగ్స్‌లో బలమైన హయరార్కీ ఉండేది. ఈ గాంగ్స్ బాస్‌ని ఓయాబున్ (నాయకుడు) అనేవాళ్లు. మిగిలిన గ్యాంగ్ మెంబర్స్‌ని.. కోబున్ (పిల్లలు) అనేవాళ్లు. వీళ్లు తమ లీడర్ పట్ల వాళ్ల లాయల్టీకి గుర్తుగా చిటికెన వేలిని కట్ చేసి బాస్‌కి గిఫ్ట్‌గా ఇచ్చేవాళ్లు. అందుకే చాలా మంది యకుజా సభ్యులకి చిటికెన వేళ్లు ఉండవు. అయితే ఈ యాకూజా గ్యాంగ్స్ జపాన్ చరిత్రలో 300 ఏళ్ల నుంచి భాగంగా ఉన్నా.. 1940 తర్వాత మొత్తం దేశాన్నే తన గుప్పిట్లో పెట్టుకునే రేంజ్‌లో ఎదిగాయి.
1940స్‌లో ఓ చిన్న చేపలు పట్టుకునే జారి యమాగుచి హరుకిచి కేవలం 50 మంది కూలీలతో యమాగుచి గుమి అనే పేరుతో తన సొంత యాకూజా గ్యాంగ్‌ని స్టార్ట్ చేశాడు. సరిగ్గా అదే టైంలో సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అవడంతో జపాన్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. దీన్ని ఛాన్స్‌గా తీసుకున్న యమాగుచి గ్యాంగ్.. బిల్డర్ కాంట్రాక్ట్స్ పట్టేయడం, సెక్యూరిటీ పేరుతో హఫ్తా వసూలు చేయడం మొదలుపెట్టింది. కట్ చేస్తే.. కేవలం 10 సంవత్సరాలలోనే 2 లక్షల మంది గ్యాంగ్‌స్టర్లు, 5200 గ్యాంగ్‌లతో జపాన్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్ సిండికేట్‌గా మారింది. కానీ ఓ గ్యాంగ్ ఇంత పెద్ద సిండికేట్‌గా ఎలా మారింది? దీనివెనకున్నదెవరు?
ప్రపంచంలో ఎక్కడ క్రైం జరిగినా.. ఎక్కడ క్రిమినల్స్ పెరిగినా.. దాని వెనక కచ్చితంగా అమెరికా హస్తం ఉంటుంది. దానికి పక్కా ప్రూఫ్ జపాన్‌లోని యాకూజా మాఫియా సిండికేట్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జపాన్‌లో కమ్యూనిజం పెరగడం స్టార్ట్ చేసింది. కానీ అది అమెరికాకి నచ్చలేదు. అందుకే.. 1950స్‌లో కమ్యూనిజాన్ని అంతం చేయడానికి జపాన్‌లో యాకూజాని పెంచి పోషించింది. కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని ఆ దేశం నుంచి తరిమి కొట్టి పెట్టుబడిదారీ దేశంగా మార్చింది. దీనికోసం యాకూజా గ్యాంగ్స్‌కి భయంకరమైన తుపాకులు, మెషీన్ గన్స్, గ్రనేడ్స్ లాంటి వెపన్స్ కూడా సప్లై చేసేది. అయితే.. అమెరికా తన స్వార్థంతో చేసిన ఈ పని వల్ల మొత్తం జపాన్ యాకూజా క్రిమినల్ గ్యాంగ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. CIA సపోర్ట్‌తో యకుజాస్ కమ్యూనిస్టులపై దాడులు చేసి అమెరికాకి సపోర్ట్ చేయడమే కాకుండా.. ఇంటర్నల్‌గా తన క్రిమినల్ సామ్రాజ్యాన్ని విపరీతంగా విస్తరించింది. కిడ్నాప్‌లు, డ్రగ్స్ స్మగ్లింగ్ లాంటి డేంజరస్ వ్యాపారాలు స్టార్ట్ చేసింది. దీంతో 1955 కల్లా.. అంటే జస్ట్ 5 ఏళ్లలోనే జపాన్‌లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సీఐఏ సపోర్ట్ ఉండటంతో జపాన్ పోలీసులు కూడా యాకూజాకి ఎదురెళ్లడానికి భయపడేవాళ్లు. దీంతో యాకూజాలకి ఎదురే లేకుండా పోయింది. దేశంలోనే పవర్‌ఫుల్ మాఫియా సిండికేట్‌గా ఎదిగి.. బహిరంగంగా యాకూజా క్రైమ్ ఆఫీస్‌లు తెరిచింది. అంటే రష్యా మీద పై చేయి సాధించాలనే యూఎస్ స్వార్థ పూరిత ఆలోచన వల్ల జపాన్‌లో భయంకరమైన మాఫియా పాతుకుపోయిందన్నమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా..? యాకూజా గ్యాంగ్స్‌ని మేం పెంచి పోషించాం.. అని అమెరికా ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటుంది. రీసెంట్‌గా యూఎస్ గవర్నమెంట్ డీక్లాసిఫై చేసిన కొన్ని కాన్ఫిడెన్షియల్ సీఐఏ డాక్యుమెంట్స్‌లో ఈ విషయం ఉంది.
యకుజా అక్రమ వ్యాపారాలను చేస్తూ, నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి మూవీ ఇండస్ట్రీని, పాలిటిక్స్‌ని కూడా యూజ్ చేసుకుంది. మన బాలీవుడ్‌లో డీ-గ్యాంగ్స్ ఎలా అయితే తన ఇన్‌ఫ్లుయెన్స్ పెంచుకుందో, సేమ్ అలాగే.. యాకూజా గ్యాంగ్స్ కూడా వాళ్ల బ్లాక్ మనీని సినిమాల్లో పెట్టి, వాటిని హిట్ చేసి, ఆ డబ్బును వైట్‌గా మార్చుకునే వాళ్లు. మొత్తం రాజకీయాలని తన గుప్పిట్లో పెట్టుకుంది. 1950స్ టైంలో జపాన్‌లో ఏ పొలిటీషియన్ గెలవాలన్నా.. ఏ లీడర్ పీఎం కావాలన్నా.. మొత్తం యాకూజా అప్రూవల్‌తోనే జరిగేది. అయితే ఇక్కడివరకు యాకూజాలంటే జపాన్ జనాల్లో వ్యతిరేకతే ఉండేది. కానీ సరిగ్గా అదే టైంలో చైనా, కొరియా, తైవాన్ గ్యాంగ్ స్టర్స్‌కి చెందిన సాంగుకుజింగ్ గ్యాంగ్ జపాన్‌కి చెందిన కొంతమంది పోలీస్‌లని కిడ్నాప్ చేశారు. దీంతో పోలీస్ హయ్యర్ అఫీషియల్స్ యామాగూచి గుమి గ్యాంగ్ హెల్ప్ అడిగారు. ఆ గ్యాంగ్ వెంటనే సాంగుకుజింగ్ గ్యాంగ్‌ని కంప్లీట్‌గా తుడిచిపెట్టేసింది. ఈ ఘటనతో అక్కడి జనాలు కూడా.. చైనా గ్యాంగ్‌ని తరిమికొట్టిన హీరోల్లా యాకూజాలని చూడటం స్టార్ట్ చేశారు. కుర్రవాళ్లకి పోలీసులు, గవర్నమెంట్ కన్నా యాకూజా గ్యాంగ్‌స్టర్స్‌పైనే నమ్మకం పెరిగిపోయింది. వాళ్లంతా గ్యాంగ్స్‌లో చేరడం స్టార్ట్ చేశారు. అంతే.. జస్ట్ 5 ఏళ్లలో 5200 కొత్త యాకూజా గ్యాంగ్స్ పుట్టుకొచ్చాయి. 2 లక్షల మంది గ్యాంగ్ స్టర్స్ పెరిగిపోయారు. జపాన్‌లోని 47 జిల్లాల్లో 36 జిల్లాలు కంప్లీట్‌గా జపాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. యాకూజా గ్యాంగ్స్ రకరకాల వ్యాపారాలు స్టార్ట్ చేసి 1950స్ టైంలోనే లక్షల కోట్లు సంపాదించడం స్టార్ట్ చేశాయి.
కానీ కొంతకాలానికి రాజకీయా నాయకులని వెనక నుంచి నడిపించడం ఏంటి? మనమే రాజకీయాల్లో అడుగుపెడితే పోలా..? అనుకుంది యామాగూచి గుమి యాకూజా గ్యాంగ్. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ప్రస్తుతం జపాన్‌లో అధికారంలో ఉన్న ఎల్‌డీపీ.. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. 1955లో, యమాగుచి గుమి గ్యాంగ్ తమ సొంత రాజకీయ పార్టీని ప్రారంభించింది. ఈ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ యకుజా సభ్యుడు నోబుసుకే కిషి, జపాన్ మొదటి ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాడు. దీంతో యకూజాలు లీగల్‌గా జపాన్‌ని రూల్ చేయడం ప్రారంభించారు. అయితే 1981లో యకుజా బాస్ కజు తవాకా మరణించడంతో, తర్వాత నాయకత్వం కోసం యామాగుచి గుమి గ్యాంగ్‌లో గ్రూప్ వార్ స్టార్ట్ అయింది. ఈ రెండు గ్యాంగ్స్ మధ్య వార్.. జపాన్‌లో అల్లకల్లోలం సృష్టించింది. ఎక్కడ చూసినా.. ఫైరింగ్ ఘటనలు, మర్డర్లు.. జరగడం స్టార్ట్ అయింది. అంతేకాకుండా.. డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సాధారణ ప్రజల్లో ఈ గ్యాంగ్స్‌పై నెగెటివిటీ పెరిగింది. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో పాటు యకుజా నేరాలు పెరిగిపోవడంతో.. జపనీస్ ప్రభుత్వం 1992లో యాంటీ-గ్యాంగ్ చట్టాల్ని తెచ్చింది. ఈ చట్టాల వల్ల యకుజా ఆఫీస్‌లన్నీ మూతపడ్డాయి. చాలామంది యకూజాలు అరెస్ట్ అయ్యారు. దీంతో జపాన్‌ని 50 ఏళ్ల పాటు ఏలిన మోస్ట్ డేంజరస్ మాఫియా సిండికేట్ యాకూజాల క్రైమ్ రూలింగ్‌కి తెర పడింది. కానీ.. అదిప్పుడు మళ్లీ రూపం మార్చుకుని.. జపాన్‌లో మళ్లీ కొత్తగా పెరుగుతోంది.
ఈ రోజుల్లో యకుజా కొత్త సిస్టమ్ ఫాలో అవుతోంది. వాళ్ల టార్గెట్ స్కూల్స్, కాలేజీల్లో చదువుకునే స్టూడెంట్స్. ఆన్‌లైన్‌లో 'యామి బటో' అంటే 'పార్ట్ టైం జాబ్స్' పేరుతో అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తూ.. 15 20 ఏళ్ల పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ 'జాబ్'లో వారికి భారీ జీతాలను ఆఫర్ చేసి, వాళ్ల చేత దొంగతనాలు, దోపిడీలు చేయిస్తున్నారు. ఇలాంటి గ్యాంగ్స్‌ని జపనీస్ పోలీసులు టోకుర్యు అని పిలుస్తున్నారు. ఈ టొకుర్యూ ట్రెండ్ పాత యకూజా గ్యాంగ్స్ కంటే చాలా డేంజరస్‌గా మారుతోంది. ఎందుకంటే.. ఈ టొకుర్యు ట్రెండ్‌కి బలవుతోంది పిల్లలు. అంటే దేశ భవిష్యత్తు నాశనం అవుతోంది.
మరి ఓజీ సినిమాలో ఇలాంటి డేంజరస్ మాఫియా గ్యాంగ్‌లో పార్ట్‌గా కనిపించబోతున్న మన పవన్ కల్యాణ్ ఈ గ్యాంగ్స్‌కి హీరో టచ్ ఇస్తారో.. లేదంటే విలన్స్‌గానే చూపిస్తారో చూడాలి. మరి మీరేం అంటారు? ఈ యకూజా గ్యాంగ్స్ గురించి మీరెప్పుడైనా ఇంతకుముందు విన్నారా..?





















