తాగండి...ఊగండి...పన్ను కట్టండి అన్నట్లుగా ప్రభుత్వం తీరుంది
తాగండి ఊగండి..పన్ను కట్టండి అన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ....ఓ పక్క ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే కొత్త సంవత్సరం పేరు చెప్పి మద్యంపై ఆంక్షలు సడలిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల వ్యసనాన్ని ప్రభుత్వం ఆయుధంగా వాడుకోవాలని చూస్తోందన్నారు. రైతు బంధు ఇచ్చి ఆ డబ్బులను మద్యం ద్వారా ప్రజల నుంచి తీసుకుంటుందని అన్నారు. కొత్త సంవత్సరం పేరుతో ఆదాయం పెంచుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రైతు విధానాలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని అన్నారు.రైతులను వరి వేయవద్దని చెప్పిన ముఖ్యమంత్రి.....తను మాత్రం వరి వేస్తున్నాడని అన్నారు.





















