Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABP
జానీ మాస్టర్ కేసు వ్యవహారం అందరికీ తెలిసిందే బాధితురాలు ఫిర్యాదుతో తాజాగా గోవాలో జానీ మాస్టర్ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేస్ నెక్స్ట్ ఎలా వెళ్ళబోతుంది? రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు. చట్టపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది కేసు? అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్లు ఎందుకు పెట్టారు? సెక్షన్ల తీవ్రత ఎలా ఉంది? శిక్షలు ఎలా ఉంటాయి? ఈరోజు తాజాగా పోలీసులు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సెక్షన్ 376 అదేవిధంగా 506 323 ఐపిసి అనేది ప్రధానంగా మూడు సెక్షన్స్ కనిపిస్తున్నాయి. కచ్చితంగా శిక్ష పడేందుకు అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.సాధారణంగా ఇటువంటి కేసెస్ లో బాధితురాలు ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు. అక్యూస్డే ప్రూవ్ చేసుకోవాలి అతను ఇన్నోసెంట్ అని. అన్లోన్ మరీ ముఖ్యంగా ఫోక్సో యాక్ట్ కింద కూడా ఫైల్ చేసింది కాబట్టి కచ్చితంగా ఇది బాధితరాలు ప్రూవ్ చేయక్కర్లేదు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్లే ప్రూవ్ చేసుకోవాల్సి రావటం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇప్పుడు అసలు పరీక్ష ఎదురు కానుంది. మరి ఈ కేసులో ఒకవేళ జానీ మాస్టర్ దోషి అని తేలితే ఎలాంటి శిక్ష పడొచ్చు..చట్టం ఏం చెబుతోంది ఈ వీడియోలో చూద్దాం.